ఓటీటీలో ఈ సినిమాను వ‌ద‌ల‌కండి.. నిజంగా జ‌రిగిన‌ థ్రిల్ల‌ర్‌! ఎందులో ఉందంటే

  • By: sr    news    Nov 29, 2024 10:32 AM IST
ఓటీటీలో ఈ సినిమాను వ‌ద‌ల‌కండి.. నిజంగా జ‌రిగిన‌ థ్రిల్ల‌ర్‌! ఎందులో ఉందంటే

విధాత‌, సినిమా: ఇటీవ‌ల ఓ ఇంట్రెస్టింగ్ చిత్రం ఏ ట్యాక్సీ డ్రైవ‌ర్ (A Taxi Driver) ఓటీటీ (Ott)లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. అప్పుడెప్పుడో ఆరేడు నెల‌ల క్రితమే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ కొరియ‌న్ , హిందీ భాష‌ల్లో మాత్ర‌మే అందుబాటులో ఉండేది. అయితే ఇది మ‌నం ఎంతో ఆస‌క్తిగా చూసే రెగ్యుల‌ర్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్‌, ఇన్వెస్టిగేష‌న్‌, రొమాన్స్‌, వార్ సినిమానో కాదు. నాలుగు ద‌శాబ్దాల క్రితం కొరియాలో నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన చిత్రం. 2017లో వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికీ హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన చిత్రాల జాబితాలో టాప్‌10లో ఉండ‌డం ఓ రికార్డు.

1980 కాలంలో కొరియాలోని ‘గ్వాంగ్జు’ అనే సిటీలో నాటి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌ళాశాల విద్యార్థులు ఉద్య‌మం మొద‌లు పెడ‌తారు. దీంతో నియంతలా వ్య‌వ‌హ‌రించే నాటి ప్ర‌ధాని మిల‌ట‌రీని రంగంలోకి దింపి న‌ర‌మేధం గావించాడు. దీంతో వేల మంది మృత్యువాత ప‌డ్డారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో జ‌ర్మ‌నీ నుంచి ఆ వార్త‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చిన రిపోర్ట‌ర్‌ను ఎక్కువ డ‌బ్బులు వ‌స్తాయ‌ని కిమ్ అనే ట్యాక్సీ డ్రైవ‌ర్ (A Taxi Driver) ‘గ్వాంగ్జు’ సిటీకి తీసుకెళ‌తాడు. తీరా అక్క‌డి వెళ్లాక అక్క‌డి ప‌రిస్థితులు చూసి డ్రైవ‌ర్‌ షాక‌వుతాడు. అయిన‌ప్ప‌టికీ డ‌బ్బుల మ‌రింత‌గా వ‌స్తాయ‌ని ఆ ప్రాంతంలో క‌లియ‌ తిప్పుతాడు. త‌ల్లి లేని త‌న‌ బిడ్డ‌ను ఊర్లోనే వ‌దిలి వ‌చ్చిన కిమ్ త్వ‌ర‌గా వెళ్లిపోవాల‌నే ధ్యాస‌లో ఉంటాడు.

ఈక్ర‌మంలో స‌డ‌న్‌గా ఓ ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్టు గాయ‌ప‌డ‌తాడు. మ‌రోవైపు మిల‌ట‌రీ వీరిని వెంబ‌డిస్తుంటుంది. ఆపై గాయ‌ప‌డిన ఒక‌రిద్ద‌రికి సాయం చేయాల్సిన బాధ్య‌త డ్రైవ‌ర్ కిమ్‌పై ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో కిమ్ అక్క‌డ ఎలా స‌ర్వైవ్ అయ్యాడు, జ‌ర్న‌లిస్టును కాపాడ‌గ‌లిగాడా, అక్క‌డ జ‌రుగుతున్న దారుణాల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌శాడా, త‌న కూతురిని క‌లుసుకున్నాడా లేదా అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌లో సినిమా అసాంతం ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెడుతుంది. సో ఇలాంటి సినిమాలంటే ఇష్టం ఉన్న‌వాళ్లు ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఈ ఏ ట్యాక్సీ డ్రైవ‌ర్ (A Taxi Driver) సినిమాను మిస్ అవ‌కుండా చూసేయండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.