Dethadi FirstLook| ఆశిష్ కొత్త చిత్రం ‘దేత్తడి’

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా వారి బ్యానర్‌లో 60వ సినిమాగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది వైష్ణవి చైతన్యతో కలిసి లవ్‌మీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరచగా రాబోవు చిత్రంపైనే అశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
మే 1 ఆశిష్ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి హీరో ఫస్ట్ లుక్‌తో పాటు, టైటిల్‌ను ప్రకటించారు. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘దేత్తడి’ (Dethadi )అనే పేరు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!