జూదంలో పట్టుబడిన తాడిపత్రి కానిస్టేబుల్ సస్పెన్సన్
సస్పెన్సన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ విధాత:జూదంలో పట్టుబడిన తాడిపత్రి కానిస్టేబుల్ ఎన్ వెంకటేష్ నాయుడు ( పి.సి నంబర్ 2867) ను సస్పెన్సన్ చేశారు. ఈమేరకు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సస్పెన్సన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 వ తేదీన తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు బియ్యం గోదాము సమీపంలో మరో 10 మందితో కలసి సదరు కానిస్టేబుల్ ఎన్ వెంకటేష్ నాయుడు జూదం ( మంగపత) ఆడుతున్నట్లు పోలీసుల దాడుల్లో […]

సస్పెన్సన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ
విధాత:జూదంలో పట్టుబడిన తాడిపత్రి కానిస్టేబుల్ ఎన్ వెంకటేష్ నాయుడు ( పి.సి నంబర్ 2867) ను సస్పెన్సన్ చేశారు. ఈమేరకు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సస్పెన్సన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 వ తేదీన తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు బియ్యం గోదాము సమీపంలో మరో 10 మందితో కలసి సదరు కానిస్టేబుల్ ఎన్ వెంకటేష్ నాయుడు జూదం ( మంగపత) ఆడుతున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడయ్యింది. ఆసందర్భంగా కానిస్టేబుల్ సహా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. దీనిపై విచారణ జరిపించి నివేదిక అందాక జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేష్ నాయుడును సస్పెన్సన్ చేశారు.