Tamannah Bhatia: తెలుగులో.. త‌మ‌న్నాస్త్రీ2 ఐటం సాంగ్ ‘ఆజ్‌ కీ రాత్‌’

  • By: sr    news    Jan 04, 2025 8:50 AM IST
Tamannah Bhatia: తెలుగులో.. త‌మ‌న్నాస్త్రీ2 ఐటం సాంగ్ ‘ఆజ్‌ కీ రాత్‌’

Tamannah Bhatia

విధాత‌: ఈ సంవ‌త్స‌రం బాలీవుడ్ నుంచి చిన్న చిత్రంగా వ‌చ్చి రికార్డులు సృష్టించిన చిత్రం స్త్రీ2 (Stree2). రాజ్ కుమార్  రావు (Raj Kumar Rao), శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) జంట‌గా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాపీస్‌ను షేక్ చేసి ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రూ.800కోట్లు కొల్ల‌గొట్టింది.

హ‌ర్ర‌ర్, కామెడీ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా రెండు నెల‌ల క్రితం ఓటీటీకి కూడా వ‌చ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది.

అయితే ఈ సినిమాలో సౌత్ ఇండియ‌న్ బ్యూటీ త‌మ‌న్నా (Tamannah Bhatia) చిన్న పాత్ర‌లో న‌టించ‌డంతో పాటు, ఐటం సాంగ్ చేయ‌గా ఆ పాట‌ కుర్ర‌కారును ఊపేసింది.

ఈ నేప‌థ్యంలో సినిమా మేక‌ర్స్ త‌మ‌న్నా (Tamannah Bhatia) న‌టించిన ‘ఆజ్‌ కీ రాత్‌’ అంటూ సాగే ఆ ప్ర‌త్యేక పాట‌ను తెలుగులో నీ కౌగిలిలో.. మ‌రో హాయిలో అంటూ అనువ‌దించి యూ ట్యూబ్‌లో విడుద‌ల చేసింది.

ఈ పాట‌కు తెలుగులో శ్రీ సాయికిర‌ణ్ సాహిత్యం అందించ‌గా సింగ‌ర్ దీప్తి సురేశ్ ఆల‌పించింది స‌చిన్‌ జిగ‌ర్ సంగీతం అందించాడు.