హాఫ్ నాలెడ్జ్ ప్ర‌శ్న‌లు అంటూ మీడియాపై త‌మ‌న్నా ఆగ్ర‌హం

  • By: sn    news    Oct 12, 2023 9:34 AM IST
హాఫ్ నాలెడ్జ్ ప్ర‌శ్న‌లు అంటూ మీడియాపై త‌మ‌న్నా ఆగ్ర‌హం

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం సౌత్, నార్త్‌ని దున్నేస్తుంది. మూడు ప‌దుల వ‌య‌స్సు దాని కూడా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఎంత మంది కుర్ర‌భామ‌లు ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నా కూడా త‌మ‌న్నాకి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. హీరోయిన్‌గా ప‌లు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ఇక సోషల్ మీడియాతో పాటు.. మరో వైపు కమర్షియల్ యాడ్స్.. ఇంకోవైపు తన బిజినెస్ లతో చేతినిండా సంపాదిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉంది. అయితే త‌మ‌న్నా ఇటీవ‌లి కాలంలో గ్లామర్ షో ఎక్కువ‌గా చేస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో అందాలు ఆర‌బోస్తున్న ఈ భామ సోష‌ల్ మీడియాలో కూడా తెగ ర‌చ్చ చేస్తుంది. అందాల ఆరబోతలో కూడా తనకు తానే సాటి అనిపించుకుంటుంది ఈ మిల్కీ భామ‌


త‌మ‌న్నా ఎప్పుడు ఎలాంటి గ్లామ‌ర‌స్ పిక్స్ షేర్ చేసిన కూడా వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంటుంది. త‌మ‌న్నా గ్లామ‌ర్‌కి ఫిదా కాని వారు ఉండ‌రు. ఇక ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ లో ఉండ‌గా, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోనుంద‌ని స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే త‌మ‌న్నా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఆమెకు విచిత్ర‌మైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ విలేకరి ప్రశ్నిస్తూ.. కెరీర్‌ తొలినాళ్లలో పద్ధతిగానే ఉండేవారు. కానీ ఈ మధ్య మీలో బోల్డ్‌నెస్‌ ఎక్కువైందని అన్నారు. తగ్గిన అవకాశాలు పెంచుకోటానికేనా ఈ తిప్పలు ప‌డుతున్నారా అని ముఖం మీదనే అడిగేయ‌డంతో త‌మ‌న్నాకి చిర్రెత్తుకొచ్చింది.


మ‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు రాసినంత తేలిక కాదు యాక్టింగ్. అస‌లు నాకు అవ‌కాశాలు త‌గ్గాయ‌ని మీకు ఎవ‌రు చెప్పారు. నేను రోజు 18 గంట‌ల పాటు ప‌ని చేస్తున్నాను. ఒక‌ప్ప‌టి క‌న్నా కూడా ఇప్పుడే బిజీగా ఉన్నాను. అయిన నాకు అవకాశాలు లేవు అని మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటూ గ‌ట్టిగానే ఇచ్చేసింది. అయిన నా ప్రవర్తన, వేషధారణ అనేవి పాత్ర డిమాండ్‌ని బట్టి ఉంటాయి. కేరక్టర్‌ నచ్చితేనే నేను న‌టిస్తాను. ఒక‌సారి క‌మిట్ అయిన త‌ర్వాత పూర్తి న్యాయం చేయడం నటిగా నా ధర్మం. హాఫ్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలడగొద్దు ప్లీజ్‌..అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది త‌మ‌న్నా. ఇక ఇంత సీరియ‌స్ టైంలో ఓ రిపోర్ట‌ర్ పెళ్లెప్పుడు అని అడ‌గ‌గా, చేసుకోవాల‌ని అనిపించిన‌ప్పుడు అని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.