పొంచి ఉన్న ‘పున్నమి’ గండం

తీరం దాటినా..తీవ్ర ముప్పు ఉందన్న ఐఎండీవిధాత ,న్యూ ఢిల్లీ: దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతున్న యస్‌ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఈ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన ఈ తుపానుకు ఇప్పుడు ‘పున్నమి’ కూడా తోడైంది. దీంతో తీరం దాటినా కూడా మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.ఈ రోజు […]

పొంచి ఉన్న ‘పున్నమి’ గండం

తీరం దాటినా..తీవ్ర ముప్పు ఉందన్న ఐఎండీ
విధాత ,న్యూ ఢిల్లీ: దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతున్న యస్‌ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఈ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన ఈ తుపానుకు ఇప్పుడు ‘పున్నమి’ కూడా తోడైంది. దీంతో తీరం దాటినా కూడా మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
ఈ రోజు పౌర్ణమి.. దీనికి తోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో అలల ఉద్ధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో తీర ప్రాంతాల్లో తుపాను పెను బీభత్సం సృష్టించనుందని హెచ్చరించారు. బెంగాల్‌లోని ఐదు సబ్‌ డివిజన్లు, ఒడిశాలోని నాలుగు బ్లాక్‌లు నీట మునిగే ప్రమాదముందన్నారు.
సాధారణంగా జాబిల్లి భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్‌ కన్పిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు విపరీతంగా ఉంటాయి. అలలు గరిష్ఠ ఎత్తులో ఎగసిడుతుంటాయి. ఇక చంద్రగ్రహణం కూడా ఇదే రోజున ఉంది. భారత్‌లో బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి చంద్రగ్రహణం మొదలవనుంది. దీంతో ఈ సాయంత్రం తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇదిలా ఉండగా యస్‌ తుపాను ధాటికి ఇప్పటికే బెంగాల్‌, ఒడిశాలోని తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తుండటంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ప్రచండ గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. ప్రస్తుతం ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతూ మరో 3 గంటల్లో బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఝార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.
విమానాలు రద్దు
తుపాను ప్రభావంతో ముంబయి నుంచి బెంగాల్‌, ఒడిశా వెళ్లే విమానాలు రద్దయ్యాయి. ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టు నుంచి కోల్‌కతా, భువనేశ్వర్‌ వెళ్లే ఆరు విమాన సర్వీసులను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.