మానవత్వం చూపడంలో అనంత జర్నలిస్టుల సేవ ఎనలేనిది…
■కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం చాలా గొప్ప విషయం…■అనంత జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్ తో పాటు పలువురు వక్తలు. కోవిడ్ కేంద్రానికి 30 వేలు విలువైన వైద్య మందులు,మాస్కులు, నగదు అందజేత.విధాత,అనంతపురం: మానవత్వం చూపడంలో అనంత జిల్లా జర్నలిస్టులకు సాటిలేనిదని సిపిఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్ తో పాటు పలువురు వక్తలు కొనియాడారు.ఈరోజు సింగమనేని నారాయణ కోవిడ్ ఆరోగ్య సహాయ కేంద్రానికి అనంత జర్నలిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 20 […]

■కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం చాలా గొప్ప విషయం…
■అనంత జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్ తో పాటు పలువురు వక్తలు.
కోవిడ్ కేంద్రానికి 30 వేలు విలువైన వైద్య మందులు,మాస్కులు, నగదు అందజేత.
విధాత,అనంతపురం: మానవత్వం చూపడంలో అనంత జిల్లా జర్నలిస్టులకు సాటిలేనిదని సిపిఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్ తో పాటు పలువురు వక్తలు కొనియాడారు.ఈరోజు సింగమనేని నారాయణ కోవిడ్ ఆరోగ్య సహాయ కేంద్రానికి అనంత జర్నలిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 20 వేల రూపాయల నగదు ,రూ.7వేలు విలువ చేసే వైద్య మందులు, మాస్కులు, గ్లౌజులను కృష్ణకళా మందిర్ వద్ద ఉన్న రేణుకా మెడికల్ స్టోర్ అధినేత చిరంజీవి తమ వంతు సాయం అందజేశారు.
అలాగే కామారుపల్లి సర్పంచ్ మూలి లక్ష్మీ కళా లోకనాథ్ రెడ్డి మూడు వేలు విలువచేసే గోధుమ పిండి ని కోవిడ్ కేంద్రానికి అందజేశారు.పీఆర్టియూ ఉపాధ్యాయ సంఘ నేత తలమర్ల విష్ణువర్ధన్ రెడ్డి రూ.5000, విఆర్వో సునీల్ కుమార్ రెడ్డి రూ.2000 లు, కమ్యూనిస్టు అభిమాని సుబ్రహ్మణ్యం గౌడ్ రూ.1000 లు తమ వంతు సాయం అందజేశారు.

సాయం అందించినందుకు అనంత జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు, మెడికల్ స్టోర్ యజమాని చిరంజీవి ,పిఆర్టియూ సంఘ నేత విష్ణువర్ధన్ రెడ్డి, కామారుపల్లి సర్పంచ్ లోకనాథ్ రెడ్డి , మహేష్ , సుబ్రహ్మణ్యం గౌడ్ ,విఆర్వో సునీల్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులను సిపిఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్ తో పాటు పలువురు వక్తలు అభినందించారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి అందించి నేను ఉన్నాను …అనే భరోసా ఇవ్వడమే ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చినవారు అవుతారన్నారు. చెయ్యి..చెయ్యి కలిపితే అదే కొండంత సాయం అన్నారు. సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనంత జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్, కాల్వ రమణ, సంతోష్, రేపటి రామాంజనేయులు, ఈశ్వరయ్య, ఆంధ్రజ్యోతి రామకృష్ణ, అనిల్ కుమార్ రెడ్డి,రామలింగారెడ్డి,శ్రీరాములు, జగదీష్,పవన్ కుమార్, కుమార్ నాయుడు పాల్గొన్నారు