Horoscope: శుక్రవారం (10.1.2025).. ఈ రోజు మీ రాశి ఫలాలు

Horoscope |జ్యోతిషం అంటే మనవారికి చెరగని నమ్మకం. లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే పడుచుకుంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది సెర్చ్ చేసేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం
కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్నకార్యాల్లో విజయం. ఆకస్మిక ధనలాభం. కుటుంబ కాలక్షేపం. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందం. శాశ్వత పనులకు శ్రీకారం.
వృషభం
సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. ఆకస్మిక ధనలాభంతో ఆనందం. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నం. స్త్రీల మూలకంగా లాభం. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణ బాధలు పోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
మిథునం
స్త్రీల మూలకంగా లాభాలు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం . కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది.సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభం. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి అద్భుత అవకాశాలు. అన్నింటా విజయం . బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి.
సింహం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం. నూతన గృహకార్యాలపై శ్రద్ధ. ఆకస్మిక ధనలాభంతో ఆనందం. బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాలు. దైవదర్శనం, భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.
కన్య
సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలుగుయి. సమాజంలో మంచిపేరు . ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోకుంటారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల
ఆత్మీయుల సహకారం. ఆకస్మిక ధననష్టం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యంతో బలహీనత. అధికార భయం . ప్రయాణాలు వాయిదా అవుతాయి.
వృశ్చికం
మిక్కిలి ధైర్య సాహసాలు. సూక్ష్మబుద్ధితో విజయం. మీ పరాక్రమానికి గుర్తింపు. శతృబాధలు తొలగుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభం. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్సు
అనుకోకుండా కుటుంబంలో కలహాలు. అశుభవార్తలు. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడాలి. మనస్తాపం. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా.
మకరం
కుటుంబ కలహాలు దూరం. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. వృథా ప్రయాణాల వల్ల అలసట. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహానికి ప్రయత్నించాలి. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు.
కుంభం
విదేశీయాన ప్రయత్నం. ఆకస్మిక ధననష్టం అవకాశం. పిల్లలతో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం
గొప్పవారి పరిచయ. స్త్రీల మూలకంగా లాభం. మంచి ఆలోచనలను ఉంటాయి. బంధు, మిత్రులు గౌరవిస్తారు. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం.