సుప్రీంను ఆశ్రయించిన టీవీ5

విధాత:ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో తమపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయడంపై టీవీ5 ఛానల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రఘురామ విద్వేష ప్రసంగాలను ప్రసారం చేశామంటూ తమపై సీఐడీ అధికారులు కేసు పెట్టారని.. ఉద్దేశపూర్వకంగానే తమ ఛానల్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని టీవీ5 తన పిటిషన్‌లో పేర్కొంది. సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఛానల్‌ అభ్యర్థించింది. సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని టీవీ 5 యాజమాన్యం సుప్రీంకోర్టును కోరింది.

సుప్రీంను ఆశ్రయించిన టీవీ5

విధాత:ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో తమపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయడంపై టీవీ5 ఛానల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రఘురామ విద్వేష ప్రసంగాలను ప్రసారం చేశామంటూ తమపై సీఐడీ అధికారులు కేసు పెట్టారని.. ఉద్దేశపూర్వకంగానే తమ ఛానల్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని టీవీ5 తన పిటిషన్‌లో పేర్కొంది.

సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఛానల్‌ అభ్యర్థించింది. సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని టీవీ 5 యాజమాన్యం సుప్రీంకోర్టును కోరింది.