Vi | క్రికెట్ ల‌వ‌ర్స్‌కు పండ‌గే.. రూ.101కే జియో హాట్‌స్టార్ OTT సబ్‌స్క్రిప్షన్‌

  • By: sr    news    Mar 23, 2025 9:31 PM IST
Vi | క్రికెట్ ల‌వ‌ర్స్‌కు పండ‌గే.. రూ.101కే జియో హాట్‌స్టార్ OTT సబ్‌స్క్రిప్షన్‌

Vi | Jio Hotstar

టీ20 క్రికెట్ లీగ్‌లో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను నిరాటంకంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. రూ. 101 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాక్‌లు వేగవంతమైన డేటాతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తాయి. ఈ సీజన్ కోసం Vi మూడు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌లను ఆవిష్కరించింది, వీటితో కస్టమర్లు క్రికెట్ మ్యాచ్‌లను ప్రతి క్షణం ఆస్వాదించవచ్చు.

కొత్త ప్యాక్‌ల వివరాలు:

1. రూ. 101 ప్యాక్: 5 జీబీ డేటా + 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (30 రోజుల వేలిడిటీ).

2. రూ. 239 ప్యాక్: అన్‌లిమిటెడ్ కాల్స్ + 2 జీబీ డేటా + జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజుల వేలిడిటీ).

3. రూ. 399 ప్యాక్: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2 జీబీ డైలీ డేటా + జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజుల వేలిడిటీ).

ఇతర Vi ప్యాక్‌ల జాబితా:

  • రూ. 469: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2.5 జీబీ/రోజు + 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజులు).
  • రూ. 994: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2 జీబీ/రోజు + 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (84 రోజులు).
  • రూ. 3699: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2 జీబీ/రోజు + 1 ఏడాది జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (365 రోజులు).

పై ప్యాక్‌లన్నీ జియోహాట్‌స్టార్ మొబైల్-ఓన్లీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. అన్ని ప్లాన్‌లలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. కస్టమర్లు Vi యాప్ లేదా www.MyVi.in వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు ఈ ప్యాక్‌లతో గేమ్‌లో ప్రతి క్షణాన్ని నిరాటంకంగా ఆనందించవచ్చు!