VD12: రెండు భాగాలుగా.. విజయ్ దేవరకొండ చిత్రం

ఫ్యామిలీ స్టార్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో సాగుతుండగా కీలక ఘట్టాలు చిత్రీకరించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అయితే ఇటీవల ఓ మీడియాతో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించకు ముందే డిసైడ్ అయ్యామని.. కాకుంటే ఈ రెండు పార్టులలో కథలు మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయని తెలిపాడు. కాగా ఈ సినిమాను మార్చిలో గానీ ఏప్రిల్‌లో గానీ థియేటర్లకు తీసుకువస్తామన్నారు.