Rashi Phalalu | బుధవారం, మార్చి 19.. ఈరోజు మీ రాశి ఫలాలు! వారికి క్షణం తీరిక లేని పరిస్థితి

Rashi Phalalu | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం. లేచిన నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం మార్చి 19, బుధవారం రోజు వారి పేర్ల పేర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (Aries) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధనచింత ఉండదు. ఆదాయం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
.
వృషభం (Taurus) : వీరికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సాఫీగా వృత్తి, ఉద్యోగాలు. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. అనేక సందర్భాల్లో ఓపికతో ఉండాలి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల విషయంలో అంచనాలకు మించి సత్ఫలితాలు. అనవసర ధన వ్యయం. పని భారం ఎక్కువ. అధిక రుణప్రయత్నాలు. అనారోగ్య సమస్యలు.
మిథునం (Gemini) : వీరికి ఈరోజు వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో అందరినీ కలుపుకు పోవాలి. ముఖ్య పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలం, సోమరితనం ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కొన్ని మంచి అవకాశాలు కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది.
కర్కాటకం (Cancer) : వీరికి ఈరోజు క్షణం తీరిక లేని పరిస్థితి. సుదీర్ఘ వ్యక్తిగత సమస్య , స్థిరాస్తుల సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ పెడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోకుండా శుభవార్తలు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాలు.భక్తిశ్రద్ధలు ఎక్కువ. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్త వహించాలి.
సింహం (Leo) : సాఫీగా వృత్తి జీవితం. నూతన వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. వ్యయ ప్రయాసలతో ముఖ్య వ్యవహారాలు పూర్తి. దైవదర్శనానికి ప్రయత్నం. రుణప్రయత్నాలు ఆలస్యంగా సఫలం. సోదర వైరం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి. ఉద్యోగుల మీద అదనపు భారం. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
కన్య (Virgo) : తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం. మనస్సు చంచలం. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు. గృహ, వాహన ప్రయత్నాలపై దృష్టి. ఆకస్మిక కలహాలు. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. సానుకూలంగా వృత్తి, వ్యాపారాలు. ఉద్యోగంలో అధిక పని భారం, ప్రాధాన్యం.అదనపు ఆదాయానికి సమయం అనుకూలం.
తుల (Libra) : సజావుగా ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృథా ప్రయాణాలు అధికం. వ్యాపారంలో లాభాలు. రుణప్రయత్నాలు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. నూతన కార్యాలకు శ్రీకారం. బంధు, మిత్రుల సహకారం ఆలస్యం. తలపెట్టిన కార్యం చాలావరకు సఫలం. విద్యార్థుల్లో పురోగతి ఉంటుంది.
వృశ్చికం (Scorpio) : నిలకడగా వృత్తి, వ్యాపారాలు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలం. ప్రయాణాలు ఎక్కువ. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో జాగురతగా ఉండడం అవసరం. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. స్థానచలనం అవకాశాలు. రుణ లాభాలు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, పని భారం.
ధనుస్సు (Sagittarius) : అదనపు ఆదాయ ప్రయత్నాలపై దృష్టి పెడతారు. కుటుంబ కలహాలు పోతాయి. ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. వృథా ప్రయాణాల వల్ల అలసట. పిల్లల విషయంలో శుభవార్తలు. అందరితో స్నేహంగా ఉండాలి. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు. ముఖ్య వ్యవహారాలు, పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకరం (Capricorn) : ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావా దేవీలలో సత్ఫలితాలు. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి బంధు, మిత్రుల నుంచి మర్యాదలు, మన్ననలు పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. అరోగ్య సమస్యలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరిస్తారు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫృగా సాగుతుంది. ఆదాయం మెరుగ్గా, బాగా అనుకూలంగా ఉంటుంది.
కుంభం (Aquarius) : ఇంటా బయటా అనుకూల వాతావరణం. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయత్నకార్యాల్లో విజయం. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, గుర్తింపు, ప్రతిఫలం ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు. నిలకడగా వ్యాపారాలు. స్థిరాస్తుల సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు.
మీనం (Pisces) : షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతం. నూతన కార్యాల ప్రారంభం వాయిదా వేసుకోవడం ఉత్తమం. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి . ఆత్మీయుల సహకారం కోసం సమయం వెచ్చిస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.