Narivetta | సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన.. టొవినో లేటెస్ట్ థ్రిల్లర్

Narivetta| క్రమక్రమంగా తెలుగు నాట సైతం మవచి గుర్తింపును దక్కించుకుంటున్న మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas). ఆయన హీరోగా నటించగా మే నెలలో థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం నరివెట్ట (Narivetta). తెలుగులో నరివెట్ట తోడేలు వేట పేరుతో విడుదల మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం అనుకున్న సమయాని కన్నా ఓ రోజు ముందే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అనురాజ్ మనోహర్ (Anuraj Manohar) దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు (Suraj Venjaramoodu), తమిళ దర్శకుడు చేరన్ (Cheran), ప్రియం వద కృష్ణన్ (Priyamvada Krishnan) కీలక పాత్రలు పోషించారు.
2003వ సంవత్సరంలో కేరళలోని ముత్తంగ అనే ఆటవీ ప్రాంతంలో ఆదివాసిలపై పోలీసులు జరిపిన ఊచకోత నేపథ్యంలో నాటి నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కింది. కథ విషయానికి వస్తే.. అప్పటివరకు ఏ పని లేకుండా లవ్, ఫ్రెండ్స్ అంటూ కాలక్షేపం చేసే హీరో వర్గీస్ పీటర్ అయిష్టంగా, బలవంతంతో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరుతాడు. మరోవైపు ఆయన పని చేసే స్టేషన్ సమీపంలోని ఆడవిలో అక్రమంగా ఉంటున్న ట్రైబల్స్‌ను వెళ్లగొట్టి ఆ ప్రాంతాన్నితమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ గిరిజనులు అందుకు అంగీకరించక పోలీసులకు ఎదురు తిరగడంతో అల్లర్లు జరుగుతాయి.
అదే సమయంలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ వర్గీస్ పీటర్ అక్కడ పోలీసులతో కలిసి అ ఆదివాసిల గ్రామాన్ని చుట్టుముట్టుతారు. ఈ క్రమంలో జరిగిన దాడిలో పోలీసుల తూటాకు ఓ గిరిజన వ్యక్తి చనిపోతాడు. దీంతోవర్గీస్ పీటర్‌ను అరెస్ట్ చేసి కేసులు పెడతారు. ఈ నేపథ్యలో అసలు ఆ మర్డర్ వర్గీస్ చేశాడా, లేక ఎవరైనా ఇరికించారా ఇంతకు అదీవాసి వ్యక్తిని ఎందుకు షూట్ చేశారు, చివరకు హీరో ఏం చేశాడు, పోలీసులు ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకోగలిగిందా లేదా అనే ఆసక్తికర కథనంతో సినిమా సాగుతూ చూసే వారికి థ్రిల్ ఇస్తుంది. ముఖ్యంగా సినిమా చివరలో టొవినో యాక్టింగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అంతేకాదు నాడు నిజంగా జరిగిన నర మేథం దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూయించడంతో మూవీ చూసిన వారుకంటతడి పెట్టక తప్పదు.
కాగా.. ఇప్పుడీ నరివెట్ట (Narivetta) సినిమా జూలై 10 గురువారం మధ్యాహ్నం నుంచే సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఎవరైతే థియేటర్‌లో ఈ సినిమాను చూడలేక పోయిన వారు, టొవినో థామస్ ఫ్యాన్స్, మలయాళ సినిమాలు అమితంగా ఇష్టపడే వారు ఎట్టి పరిస్తితుల్లోనూ మిస్ అవకుండా తప్పక చూసి తీరాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీ అంతా కలిసి వీక్షించవచ్చు.