వెల్లంపల్లి ఉచ్చులో పడి మోసపోవద్దు: కన్నబాబుకు పోతిన మహేశ్ హితవు
వెల్లంపల్లితో మీరు మిలాఖత్ అయ్యారువిజయవాడ దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలు జరిగాయివెల్లంపల్లి ఒక అవినీతి మంత్రివిధాత:ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉచ్చులో పడ్డారని జనసేన నేత పోతిన వెంకట మహేశ్ అన్నారు. చీరాల వేటపాలం కోఆపరేటివ్ సొసైటీలో అక్రమాలు జరిగియంటూ వార్తాపత్రికలో కథనం వచ్చిన వెంటనే ఎంక్వైరీ వేశారని… మరి, వెల్లంపల్లితో మిలాఖత్ అయిన మీరు… నిబంధనలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమంలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో కూడా పెద్ద […]

వెల్లంపల్లితో మీరు మిలాఖత్ అయ్యారు
విజయవాడ దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలు జరిగాయి
వెల్లంపల్లి ఒక అవినీతి మంత్రి
విధాత:ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉచ్చులో పడ్డారని జనసేన నేత పోతిన వెంకట మహేశ్ అన్నారు. చీరాల వేటపాలం కోఆపరేటివ్ సొసైటీలో అక్రమాలు జరిగియంటూ వార్తాపత్రికలో కథనం వచ్చిన వెంటనే ఎంక్వైరీ వేశారని… మరి, వెల్లంపల్లితో మిలాఖత్ అయిన మీరు… నిబంధనలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమంలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అన్నారు. ఈ బ్యాంకు గత పాలకమండలిపై విచారణ కూడా జరుగుతోందని చెప్పారు. ఇలాంటి సమయంలో ముగ్గురు అధికారుల పాలనను ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. వెల్లంపల్లి ఒక అవినీతి మంత్రి అని… ఆయన ఉచ్చులో పడి మోసపోవద్దని కన్నబాబుకు సూచించారు.