విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత బాబుదే .. కళా వెంకట్రావు

విధాత:విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదయితే, కమీషన్లు దండుకుంటున్న ఘనత జగన్ రెడ్డిది.వైసీపీ ప్రభుత్వ చేతకాని పాలనతో 2 ఏళ్లలోనే విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో కి నెట్టారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి అన్నదాతల్ని అప్పుల పాలు చేయొద్దు.మాట ఇవ్వడం మోసం చేయడం జగన్ రెడ్డికి దిన చర్యగా మారింది.ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి,అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల లోనే 3 సార్లు పెంచి ప్రజలపై భారం మోపారు.టీడీపీ హయాంలో జరిగిన సౌర‌, […]

విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత  బాబుదే .. కళా వెంకట్రావు

విధాత:విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదయితే, కమీషన్లు దండుకుంటున్న ఘనత జగన్ రెడ్డిది.వైసీపీ ప్రభుత్వ చేతకాని పాలనతో 2 ఏళ్లలోనే విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో కి నెట్టారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి అన్నదాతల్ని అప్పుల పాలు చేయొద్దు.మాట ఇవ్వడం మోసం చేయడం జగన్ రెడ్డికి దిన చర్యగా మారింది.ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి,అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల లోనే 3 సార్లు పెంచి ప్రజలపై భారం మోపారు.టీడీపీ హయాంలో జరిగిన సౌర‌, ప‌వ‌న విద్యుత్ ఒప్పందాలలో అవినీతి జరిగిందన్నారు.

మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది ఏం నిరూపించారు? చంద్రబాబు హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదు, మిగులు విద్యుత్ సాధించి 24 గంటల కరెంట్ ఇచ్చాం.నేడు వైసీపీ ప్రభుత్వ చేతకానిపాలన, అనాలోచిత నిర్ణయాలతో కరెంట్ కోతలు, విద్యుత్ బిల్లుల మోతలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు