మీకైతే హైదరాబాద్‌లో చికిత్సా.. పేదలు మాత్రం చనిపోవాలా?
సీఎం జగన్ రెడ్డి గారు.. మన రాష్ట్రంలో సరైన వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకు ఎందుకు వెళతారు..? ఇక్కడుంటే ప్రాణాలు నిలవవు కాబట్టే హైదరాబాద్‌కు వెళుతున్నారు.. కానీ అక్కడికి కూడా వెళ్లే అవకాశం లేదు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కోవిడ్ వస్తే ఆగమేఘాలపై హైదరాబాద్ పోయి అక్కడి ఆస్పత్రుల్లో చేరతారు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్లే అవకాశం మాత్రం ఇప్పించలేరా? ఇంత చేతగాని, దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడదు. తాడేపల్లి కొంపలో ఎన్ని […]

సీఎం జగన్ రెడ్డి గారు.. మన రాష్ట్రంలో సరైన వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకు ఎందుకు వెళతారు..? ఇక్కడుంటే ప్రాణాలు నిలవవు కాబట్టే హైదరాబాద్‌కు వెళుతున్నారు.. కానీ అక్కడికి కూడా వెళ్లే అవకాశం లేదు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కోవిడ్ వస్తే ఆగమేఘాలపై హైదరాబాద్ పోయి అక్కడి ఆస్పత్రుల్లో చేరతారు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్లే అవకాశం మాత్రం ఇప్పించలేరా?
ఇంత చేతగాని, దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడదు. తాడేపల్లి కొంపలో ఎన్ని గంటలు నిద్రపోతారు గానీ, లేచి కేసీఆర్ గారికి ఫోన్ చేసి అనుమతులు తెప్పించండి. తెలంగాణ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో అత్యవసరంగా పరిగణించి కోవిడ్ పేషెంట్ల అంబులెన్సులను అనుమతించాలి. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారికి మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తరలిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం దీనిని దృష్టిలో వుంచుకుని కోవిడ్ పేషెంట్ల అంబులెన్సులను ఆపకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. గోల్డెన్ అవర్స్‌లోగా వారు ఆస్పత్రికి చేరగలిగితే కొన ఊపిరితో ఉన్న ప్రాణాలు నిలబడతాయి. అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.