పార్లమెంటులో పెరగనున్న సినీ నటుల ప్రాతినిధ్యం

దేశంలో సినీ ప్రముఖులకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, వినోద్ ఖన్నా, రాజేశ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి తమదైన ముద్ర వేశారు.

పార్లమెంటులో పెరగనున్న సినీ నటుల ప్రాతినిధ్యం

దేశంలో సినీ ప్రముఖులకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, వినోద్ ఖన్నా, రాజేశ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి తమదైన ముద్ర వేశారు. ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో కొందరు సెలబ్రిటీలు మొదటిసారి పోటీపడినప్పటికీ అద్భుత విజయాలు సాధించారు. వారంతా తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. మరికొందరు నటులు తమ స్థానాన్ని నిలబెట్టుకుని మరోసారి లోక్ సభ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈసారి బీజేపీ తరపున ఎక్కువ మంది నటులు పార్లమెంట్‌లో అడుగుపెడుతుండగా.. తర్వాత స్థానంలో టీఎంసీ నుంచి ఉన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడిన బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రౌనత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలిసారి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రామాయణం సిరియల్‌ రాముడి పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించిన అరుణ్‌ గోవిల్‌ యూపీలోని మీరట్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు, ప్రముఖ నటుడు సురేశ్‌ గోపి కేరళ లోని త్రిశూర్‌ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. కేరళలో ఇప్పటివరకు ఖాతా తెరువని కమలం పార్టీకి మొదటి విజయాన్ని అందించారు. సురేశ్‌ గోపి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా సేవలు అందించిన విషయం విదితమే. మరో బాలీవుడ్‌ నటి హేమా మాలిని యూపీలోని మథుర నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచిన మూడోసారి బరిలోకి దిగి హ్యాట్రిక్‌ సాధించారు.

ప్రముఖ భోజ్‌పురి గాయకుడు మనోజ్‌ తివారీ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ తరఫున మరోసారి బరిలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరో భోజ్‌పురి నటుడు రవికిషన్‌ యూపీలో గోరఖ్‌పూర్‌లో రెండోసారి విజయం సాధించారు. పశ్చిమ్‌ బెంగాల్‌ నుంచి అస్‌నోల్‌ నుంచి తృణమూల్‌ తరఫున బరిలోని నిలిచిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శతృజ్ఞ సిన్హా బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పశ్చిమ బెంగాలోని మేదినీపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బెంగాలీ నటి జూన్‌ మాలియా బీజేపీకి చెందిన అగ్ని మిత్ర పాల్‌పై విజయం సాధించారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ మాలియా ఎన్నికయ్యారు. మరో నటి రచనా బెనర్జీ బెంగాల్ లోని హుగ్లీ నుంచి తొలిసారి బరిలో నిలిచి బీజేపీ అభ్యర్థి, నటి లాకెట్‌ ఛటర్జీపై గెలిచారు. మరో నటి, బీజేపీ స్మృతి ఇరానీ అమేథీ గత ఎన్నికల్లో రాహుల్‌ గాంధీపై గెలిచి సంచలనం సృష్టించారు. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరీలాల్‌ శర్మపై ఓడిపోయారు.