ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి
మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కామెంట్స్…. విధాత :ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత లేకుండాపోయింది.సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఓ ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే ఇప్పటికి సరైన స్పందన లేదు.రాష్ట్రంలో దిశా చట్టం ఏమైంది, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తానన్న సీఎం ప్రగల్భాలు ఏమయ్యాయి? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి.పోలీసులు కేవలం టీడీపీ నాయకులపై కక్ష్య సాధించడం కోసమే పనిచేస్తున్నారు, మహిళలపై దాడులు వాళ్ళకి పట్టవు.ఆడ బిడ్డలకు […]

మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కామెంట్స్….
విధాత :ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత లేకుండాపోయింది.సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఓ ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే ఇప్పటికి సరైన స్పందన లేదు.రాష్ట్రంలో దిశా చట్టం ఏమైంది, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తానన్న సీఎం ప్రగల్భాలు ఏమయ్యాయి? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి.పోలీసులు కేవలం టీడీపీ నాయకులపై కక్ష్య సాధించడం కోసమే పనిచేస్తున్నారు, మహిళలపై దాడులు వాళ్ళకి పట్టవు.ఆడ బిడ్డలకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాం, ఇలాంటి ఘటనలకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.
ReadMore:ఏపీలో ఘటన జరిగితే తెలంగాణ వెళ్లి ఫిర్యాదు చేయాలా? : హైకోర్టు