సాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి: కౌశిక్ రెడ్డి ఓ కొత్త కుక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి రూపంలో కల్వకుంట్ల కుటుంబానికి కొత్త కుక్క దొరికిందని ఘాటుగా స్పందించారు. ఆ కుక్కతో ఎలా పడితే అలా మొరిగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఇంట్లో పడుకుని కుక్కలను బయటికి పంపుతున్నారన అన్నారు.

విధాత, హైదరాబాద్: కౌశిక్ ఎమ్మెల్యే అయ్యి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావట్లేదని, నోరు అదుపులో పెట్టుకోక పోతే సన్నబియ్యం తింటున్న ప్రజలు బట్టలూడదీసి కొడతారని హెచ్చిరించారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మహిళలు, తెలంగాణ యువత ఏకమై నీ లాంటి బిచ్చపు కొడుకులను ఉరికిచ్చి కొడతారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ హ్యాకర్స్‌ను పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నారని, దీన్ని రుజువు చేస్తానని కౌశిక్ రెడ్డి అంటున్నాడు. అలా రుజువు చేస్తే కేటీఆర్ బయట పడతాడో ఎవరు బయట పడుతారో తెలుస్తుందన్నారు.
నీలాంటి సన్నాసుల గురించి హ్యాకింగ్ చేస్తామా, మీకే గతి లేదు మీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకేం పట్టిందని శివసేనా రెడ్డి మండిపడ్డారు. హ్యాకర్స్‌తో దుకాణం పెట్టింది నీకు బిస్కెట్స్ వేస్తున్న కేటీఆర్ అని, కౌశిక్ రెడ్డి బతుకేందో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.