వీరు కరోనాకంటే డేంజర్.. మంత్రి కొడాలి
విధాత(అమరావతి): చంద్రబాబు, రాధా కృష్ణ, రామోజీ , టీవీ5 నాయుడు కరోనా కంటే డేంజర్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వీరు కుల పిచ్చితో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. నారావారి పల్లెల్లో కొత్త వైరస్ పుట్టిందని, ఆ వైరస్ పేరు నారా 420ని ఎద్దేవా చేశారు. జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కూర్చుని చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు మూడు డోసులు వ్యాక్సిన్లు వేయించుకున్నారని, సింగపూర్ […]

విధాత(అమరావతి): చంద్రబాబు, రాధా కృష్ణ, రామోజీ , టీవీ5 నాయుడు కరోనా కంటే డేంజర్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వీరు కుల పిచ్చితో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. నారావారి పల్లెల్లో కొత్త వైరస్ పుట్టిందని, ఆ వైరస్ పేరు నారా 420ని ఎద్దేవా చేశారు. జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇంట్లో కూర్చుని చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు మూడు డోసులు వ్యాక్సిన్లు వేయించుకున్నారని, సింగపూర్ నుంచి వ్యాక్సిన్ తెప్పించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు కరోనా వ్యాక్సిన్ కాదు పిచ్చికుక్క కరిచినప్పుడు వేసే రెబిస్ వ్యాక్సిన్ వేయాలన్నారు.
బాబుకు దమ్ముంటే వ్యాక్సిన్ ఇప్పించాలి, ఎంత డబ్బైనా ఫర్వాలేదు.. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు ఇప్పించండి అని అన్నారు. బాబు, కుల మీడియాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కరోనా సమయంలో ఎన్నికలు వద్దని చెప్పినా వినలేదన్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ కూడపల్కొని ఎన్నికలు పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పెట్టి కరోనా ఉదృతికి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌లే కారణమయ్యారని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు ఆరోపించారు.