బ‌ర్త్‌డే బాయ్ ధోనీకి అరుదైన వీడియోతో ఐసీసీ సెల్యూట్‌

విధాత,ముంబై: ఇండియ‌న్ టీమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ల‌లో ఒక‌డైన ఎమ్మెస్ ధోనీ బుధ‌వారం (జులై 7) త‌న 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా కెప్టెన్‌గా త‌న కెరీర్‌లో అత‌ను తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌కు సంబంధించి ఓ వీడియో రూపొందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత‌నికి బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది. ఈ ఐదు నిమిషాల వీడియో ఊహించిన‌ట్లే 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌తో మొద‌లైంది. ఆ ఫైన‌ల్ చివ‌రి ఓవ‌ర్‌ను జోగింద‌ర్ శ‌ర్మ‌లాంటి అనామ‌కుడితో వేయించాల‌ని ధోనీ […]

బ‌ర్త్‌డే బాయ్ ధోనీకి అరుదైన వీడియోతో ఐసీసీ సెల్యూట్‌

విధాత,ముంబై: ఇండియ‌న్ టీమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ల‌లో ఒక‌డైన ఎమ్మెస్ ధోనీ బుధ‌వారం (జులై 7) త‌న 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా కెప్టెన్‌గా త‌న కెరీర్‌లో అత‌ను తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌కు సంబంధించి ఓ వీడియో రూపొందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత‌నికి బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది. ఈ ఐదు నిమిషాల వీడియో ఊహించిన‌ట్లే 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌తో మొద‌లైంది. ఆ ఫైన‌ల్ చివ‌రి ఓవ‌ర్‌ను జోగింద‌ర్ శ‌ర్మ‌లాంటి అనామ‌కుడితో వేయించాల‌ని ధోనీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం చాలా మందికి మింగుడుప‌డ‌లేదు. ఆ త‌ర్వాత కూడా ఇలాంటివే ఎన్నో అనూహ్య నిర్ణ‌యాలు కెప్టెన్‌గా ధోనీ తీసుకున్నాడు. ఇలాంటి నిర్ణ‌యాల‌తోనే 2007 టీ20 వ‌రల్డ్‌క‌ప్‌తోపాటు 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013 చాంపియ‌న్స్ ట్రోఫీలాంటి విజ‌యాలు సాధించిపెట్టాడు. ఆ వీడియోల‌న్నింటినీ సంక్షిప్తంగా ఐసీసీ ఇందులో పొందుప‌రిచింది.