అజారుద్దీన్ అజార్‌కు ప‌ద‌వీ గండం

హె‌చ్‌సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా జాన్ మ‌నోజ్‌ విధాత:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్‌ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం‌ జాన్ మనోజ్ హెచ్‌సీఏ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇటీవల అజారుద్దీన్ హెచ్‌సీఏ సభ్యత్వం రద్దు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ క్రమంలో తాత్కాలిక ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్‌ను నియమిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ వెల్ల‌డించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంతో ఎవరకి వారే అన్న చందంగా […]

అజారుద్దీన్ అజార్‌కు ప‌ద‌వీ గండం

హె‌చ్‌సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా జాన్ మ‌నోజ్‌

విధాత:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్‌ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం‌ జాన్ మనోజ్ హెచ్‌సీఏ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇటీవల అజారుద్దీన్ హెచ్‌సీఏ సభ్యత్వం రద్దు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

ఈ క్రమంలో తాత్కాలిక ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్‌ను నియమిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ వెల్ల‌డించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంతో ఎవరకి వారే అన్న చందంగా హెచ్‌సీఏలో పరిస్థితి నెలకొంది. అయితే క్రికెట్ సీజన్ మొదలుకాబోతున్న తరుణంలో హెచ్‌సీఏలో వివాదం క్రికెట్ ప్లేయర్లలో ఆందోళన కలిగిస్తోంది.