DK| రోహిత్- కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఆ నలుగురే.. డీకే స్టన్నింగ్ కామెంట్స్
DK| టీ 20 ప్రపంచ కప్ అందుకున్న తర్వాత భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట కోహ్లీ పొట్టి క్రికెట్‌కి గుడ్ బై చెప్పడం మనం చూశాం. ఇక వారిద్దరు కొన్నాళ్లపాటు వన్డే, టెస్ట్ క్రికెట్ మ్యాచ్ మాత్రమే ఆడనున్నారు. అయితే రోహిత్, విరాట్ టీ20ల నుండి తప్పుకున్న తర్వాత వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నలు అం

DK| టీ 20 ప్రపంచ కప్ అందుకున్న తర్వాత భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట కోహ్లీ పొట్టి క్రికెట్‌కి గుడ్ బై చెప్పడం మనం చూశాం. ఇక వారిద్దరు కొన్నాళ్లపాటు వన్డే, టెస్ట్ క్రికెట్ మ్యాచ్ మాత్రమే ఆడనున్నారు. అయితే రోహిత్, విరాట్ టీ20ల నుండి తప్పుకున్న తర్వాత వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శుభ్‌మాన్ గిల్ భర్తీ చేయగలరని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.
‘మొదట, రోహిత్, కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. కానీ, ప్రస్తుతం ఈ బ్యాట్స్‌మెన్‌లను భర్తీ చేయగలరని నేను భావిస్తున్నాను. ఇక టీ20 క్రికెట్‌లో ప్లేయింగ్-11లో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కడం ఖాయమని చెప్పుకొచ్చాడు.ఇక గిల్ ఇప్పుడు భారత వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శ్రీలంకతో ఆడనున్న టీ20, వన్డే సిరీస్‌లకి గిల్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ 4-1తో భారత్‌కి ట్రోఫీ దక్కేలా చేశాడు. అలాగే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ అతని పేరుపై ఉంది. గతేడాది న్యూజిలాండ్‌పై 63 బంతుల్లో 126 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం వచ్చినప్పుడు గైక్వాడ్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన యువ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.వీరిద్దరిలాగే తిలక్ వర్మ కూడా తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించి జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌లో కూడా రాణిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో రికార్డు సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే అభిషేక్ శర్మను తదుపరి పర్యటనకు ఎంపిక చేయకపోవడం పై భజ్జీ తప్పు పట్టాడు.