Virat Kohli| లండ‌న్‌లో ప‌ర్మినెంట్‌గా ఉండే ప్లాన్ చేస్తున్న విరాట్ కోహ్లీ…!

Virat Kohli| 2007 త‌ర్వాత టీమిండియా 2024లో టీ20 ప్ర‌పంచ క‌ప్ అందుకోవ‌డం మ‌నం చూశాం. 17 ఏళ్లుగా క‌ప్ కోసం ఎంతో ఫైట్ చేస్తూ వ‌చ్చిన టీమిండియా ఎట్ట‌కేల‌కి ఆ క‌ల‌ని సాకారం చేసుకుంది. దీంతో ముంబైలో విక్ట‌రీ ప‌రేడ్ ఘ‌నంగా జ‌రిగింది. టీమిండియా క్రికెటర్లు అంద‌రు ఓపెన్ బస్ లో రోడ్ షో చేశా

  • By: sn    sports    Jul 06, 2024 8:55 AM IST
Virat Kohli| లండ‌న్‌లో ప‌ర్మినెంట్‌గా ఉండే ప్లాన్ చేస్తున్న విరాట్ కోహ్లీ…!

Virat Kohli| 2007 త‌ర్వాత టీమిండియా 2024లో టీ20 ప్ర‌పంచ క‌ప్ అందుకోవ‌డం మ‌నం చూశాం. 17 ఏళ్లుగా క‌ప్ కోసం ఎంతో ఫైట్ చేస్తూ వ‌చ్చిన టీమిండియా ఎట్ట‌కేల‌కి ఆ క‌ల‌ని సాకారం చేసుకుంది. దీంతో ముంబైలో విక్ట‌రీ ప‌రేడ్ ఘ‌నంగా జ‌రిగింది. టీమిండియా క్రికెటర్లు అంద‌రు ఓపెన్ బస్ లో రోడ్ షో చేశారు. టీం ఇండియా ఆటగాళ్లంతా బస్సు పైకప్పుపై ఉండి అభిమానులకి వంద‌నం చేస్తూ ముందుకు క‌దిలారు. ఇక ఆ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియంలో టీమ్ ఇండియా విజయోత్సవ పరేడ్ నిర్వహించింది. ఇందులో విరాట్ కోహ్లీ వందేమాతరం ఆలపించి అభిమానులను అలరించాడు. ఇక సెల‌బ్రేష‌న్స్ త‌ర్వాత అంద‌రు కూడా వారి వారి ప్రాంతాల‌కి వెళ్లారు. అయితే కోహ్లీ మాత్రం లండ‌న్‌కి వెళ్ల‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.

కొద్ది రోజులుగా కోహ్లీ లండ‌న్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. అనుష్క శర్మ, వామిక, అకాయ్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు.క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన త‌రువాత కోహ్లి, అనుష్క‌శ‌ర్మ‌లు లండ‌న్‌లో స్థిర‌ప‌డాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని, అందులో భాగంగానే అక్క‌డే ఎక్కువ‌గా ఉంటున్నార‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.2023 డిసెంబ‌ర్‌లో కోహ్లి త‌న కుటుంబంతో క‌లిసి కొన్ని రోజులు లండ‌న్ టూర్‌కి వెళ్లాడు. ఇక అక్క‌డ ఓ రెస్టారెంట్ లో అనుష్క‌తో క‌లిసి ఫోటోలు దిగారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి లండన్‌లో మెరిసాడు. అనుష్క శర్మ అయితే చివరిసారిగా జూన్ ప్రారంభంలో ముంబైలో కనిపించింది.

కొడుకు పుట్టిన ఐదు రోజుల త‌రువాత విరుష్క జంట త‌మ‌కి అకాయ్ జ‌న్మించిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. లండ‌న్‌లో అకాయ్ జ‌న్మించాడ‌ని, రెండో బిడ్డకు స్వాగ‌తం ప‌లికేందుకు కోహ్లి లండ‌న్‌కు వెళ్లడంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడ‌ని అప్ప‌ట్లో తెగ ప్ర‌చారాలు కూడా సాగాయి. అయితే విరాట్ క్రికెట్‌కి వీడ్కోలు ప‌లికే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో లండ‌న్‌లో స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది. త‌న‌కి యూర‌ప్ అంటే ఇష్ట‌మ‌ని గ‌తంలో కోహ్లీ చెప్పాడు. అక్క‌డ త‌నని ఎవ‌రు పెద్ద‌గా గుర్తించ‌క‌పోవ‌డంతో అక్క‌డ‌ సాధార‌ణ జీవితం గ‌డ‌పొచ్చ‌నే ఉద్దేశంతోనే కోహ్లీ ఈ ప్లాన్ చేసిన‌ట్టు నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.