నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

ఎడమ చేతివాటం ఎంతో ప్రత్యేకం జనాభాలో 10 నుంచి 12 శాతం మంది ప్రముఖుల్లో ఎందరో లెఫ్ట్‌ హ్యాండర్స్‌ విధాత‌:వీరిలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని అంచనా ప్రజ్ఞావంతులై చరిత్ర సృష్టిస్తారట నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే..చేయి మారినా రాత మారలేదంటారు. ఎడమ చేతివాటం వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ […]

నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే
  • ఎడమ చేతివాటం ఎంతో ప్రత్యేకం
  • జనాభాలో 10 నుంచి 12 శాతం మంది
  • ప్రముఖుల్లో ఎందరో లెఫ్ట్‌ హ్యాండర్స్‌

విధాత‌:వీరిలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని అంచనా ప్రజ్ఞావంతులై చరిత్ర సృష్టిస్తారట నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే..చేయి మారినా రాత మారలేదంటారు. ఎడమ చేతివాటం వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు.

ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ‘కుడి’ పదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడికాలు పెట్టు…అన్నమాటలు తరచూ వింటుంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్లు, చేతులు. ప్రయాణానికి కాళ్లు, పనులు చేసేందుకు చేతులు ప్రధానం. చేతుల్లో కుడి చేతివాటం, ఎడమ చేతివాటం వారని రెండు రకాలు. చేసేపని ఒక్కటే అయినా ఒక్కొక్కరికీ ఒక్కో చేతితో చేయడం సౌలభ్యంగా ఉంటుంది. అయితే జనాభాలో 90 శాతం మంది కుడిచేతితోనే ఏదైనా పనిచేస్తారు. మిగిలిన పది శాతం ఎడమచేతివాటం. అందుకే వారు ప్రత్యేకం. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమ చేతివాటం వారని అంచనా. ఎడమ చేతివాటం అన్నది శారీరకంగా, మానసికంగా అబ్బి న అలవాటు. కొందరు పిల్లలు అన్నిపనులు ఎడమచేతితోనే చేస్తుంటారు. ఇటువంటి వారికి తల్లిదండ్రులు కుడిచేతితో తినడం, ఇతర పనులు బలవంతంగా అలవాటు చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఇవి అబ్బవు. ముఖ్యంగా పనులు చేయడం, రాయడం వంటివి మారడం చాలా అరుదు. ఇది ఒక శారీరక, మానసిక ప్రక్రియ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

నలభై ఏళ్ల తరువాత ఎవరికైనా పిల్లలు పుడితే సాధారణంగా వారు ఎడమచేతి వాటం వారై ఉంటారని చెబుతారు. బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు కారణంగా 75 శాతం ఎడమ చేతివాటం వస్తుందని, కొన్ని సర్వేల్లో తేలింది. జన్యువులు కారణంగా ఎడమ చేతివాటం రావడానికి 25 శాతం అవకాశం ఉంది. ఎడమచేతివాటం వారు గొప్ప అదృష్టవంతులవుతారని, ప్రత్యేక గుణాలు కలిగి ఉంటారని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని, గర్వించదగ్గ విజయాలు నమోదు చేస్తారని పలుసందర్భాల్లో నిరూపితమైంది. అందుకే ఎడమ చేతి వాటానికి అంత ప్రాముఖ్యం.