Viral news | పునర్జన్మ నిజంగా ఉంటుందా.. ఈ బాలిక మాటలు వింటే నిజమేననిపిస్తోంది..!

Viral news | పునర్జన్మ గురించి తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి. కొందరు పునర్జన్మ ఉందని అంటే, మరికొందరు అలాంటిదేది లేనేలేదని వాదిస్తుంటారు. వాస్తవానికి పునర్జన్మ ఉంటుంది అని గానీ, ఉండదు అని గానీ ఎవరూ రుజువు చేయలేని పరిస్థితి. కానీ తాజాగా ఓ ఐదేళ్ల బాలిక మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందేమో అనే నమ్మకం కలుగుతోంది. తనది పునర్జన్మ అని, గత జన్మలో తాను స్కూల్ నుంచి తిరిగి వస్తూ 'కచ్‌' భూకంపంలో మరణించానని చెబుతోంది. ఆ బాలిక ఇంకా ఏం చెప్పిందో వివరంగా తెలుసుకుందాం..

Viral news | పునర్జన్మ నిజంగా ఉంటుందా.. ఈ బాలిక మాటలు వింటే నిజమేననిపిస్తోంది..!

Viral News : పునర్జన్మ గురించి తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి. కొందరు పునర్జన్మ ఉందని అంటే, మరికొందరు అలాంటిదేది లేనేలేదని వాదిస్తుంటారు. వాస్తవానికి పునర్జన్మ ఉంటుంది అని గానీ, ఉండదు అని గానీ ఎవరూ రుజువు చేయలేని పరిస్థితి. కానీ తాజాగా ఓ ఐదేళ్ల బాలిక మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందేమో అనే నమ్మకం కలుగుతోంది. తనది పునర్జన్మ అని, గత జన్మలో తాను స్కూల్ నుంచి తిరిగి వస్తూ ‘కచ్‌’ భూకంపంలో మరణించానని చెబుతోంది. ఆ బాలిక ఇంకా ఏం చెప్పిందో వివరంగా తెలుసుకుందాం..

గుజరాత్‌లోని బనస్కాంత ప్రాంతానికి చెందిన ఓ ఐదేళ్ల బాలిక దక్ష ఇది తనకు పునర్జన్మ అని పేర్కొంది. ఆమె గత జన్మలో ఎలా చనిపోయిందో, ఎక్కడ నివసించిందో కూడా చెబుతోంది. ఆ అమ్మాయి మాటలను నిజమని నమ్మాలని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. అవేమిటంటే ఆ అమ్మాయి ఇంతవరకు పాఠశాలకు వెళ్లలేదు. ఆమె పుట్టినప్పటి నుంచి గుజరాతీ మాట్లాడే వారితోనే పెరిగింది. కానీ కొన్నిసార్లు ఆమె హిందీలో అనర్గళంగా మాట్లాడుతోంది. ఆమె తన గత జన్మ గురించి హిందీలోనే చెబుతోంది.

దక్ష హిందీలో మాట్లాడుతుంటే ఆమె కుటుంబంతో సహా గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయారు. 23 ఏళ్ల క్రితం తాను కచ్ జిల్లాలోని అంజర్ ప్రాంతంలో నివసించినట్లు ఆ బాలిక తెలిపింది. గత జన్మలో తనతోపాటు తన కుటుంబం 2001లో కచ్‌లో సంభవించిన భూకంపంలో మరణించారని వెల్లడించింది. దక్ష మాటలతో కూడిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం దక్ష తన తల్లిదండ్రులతో ఖాసా గ్రామంలో నివసిస్తున్నది. దక్ష తండ్రి జేతాజీ ఠాకూర్ వ్యవసాయం చేస్తున్నాడు.

జేతాజీ ఠాకూర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తమ చుట్టపక్కల ఎవ్వరూ హిందీ మాట్లాడరని బాలిక తండ్రి జేతాజీ తెలిపారు. అయినా ఆమె హిందీ అనర్గళంగా మాట్లాడటం ఎక్కడ నేర్చుకుందో తనకు తెలియదన్నారు. జేతాజీ ఠాకూర్, అతని భార్య గీతాబెన్ మొదటిసారిగా దక్ష హిందీ మాట్లాడటం విన్నప్పుడు.. ‘హిందీ మాట్లాడటం ఎలా నేర్చుకున్నావు’ అని అడిగారట. అప్పుడు దక్ష దేవుడు తనను ఇక్కడికి పంపాడని చెప్పిందట. ఆమె గత జన్మలో అంజార్‌లో నివసించానని తెలిపిందట. గత జన్మలో తన పేరు ప్రింగిల్ అని చెప్పిందట.

దక్ష తాను గత జన్మలో అంజార్‌లో నివసించానని, మరణించిన రోజున పాఠశాల నుంచి తిరిగి ఇంటి వస్తున్నానని చెబుతోంది. భవనం పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో తన తల్లిదండ్రులు కూడా చనిపోయారని చెప్పింది. ‘మళ్లీ అంజర్‌ వద్దకు వెళ్లాలనుకుంటున్నావా..?’ అని అడిగినప్పుడు వెళ్లనని, ఇక్కడే ఉంటానని దక్ష తెలిపింది.