Viral news | భార్యతో ప్రమాదకర శృంగార భంగిమకు ప్రయత్నిస్తే.. అది విరిగిపోయిందట..!

Viral news | శృంగారం చేసే సమయంలో కొంతమంది కొత్తకొత్త పొజిషన్‌లు ప్రయత్నించడం సర్వసాధారణం. ఎప్పుడూ ఒకే పొజిషన్‌లో శృంగారం బోర్‌ కొట్టడంవల్ల కొందరు ఇలా కొత్త భంగిమలు ప్రయత్నిస్తారు. మరికొందరు ప్రమాదకరమైన విపరీత భంగిమల్లో పాల్గొంటారు. అలాంటి ప్రయత్నమే బెడిసి కొట్టి ఓ వ్యక్తి జననాంగం విరిగిపోయింది.

Viral news | భార్యతో ప్రమాదకర శృంగార భంగిమకు ప్రయత్నిస్తే.. అది విరిగిపోయిందట..!

Viral news : శృంగారం చేసే సమయంలో కొంతమంది కొత్తకొత్త పొజిషన్‌లు ప్రయత్నించడం సర్వసాధారణం. ఎప్పుడూ ఒకే పొజిషన్‌లో శృంగారం బోర్‌ కొట్టడంవల్ల కొందరు ఇలా కొత్త భంగిమలు ప్రయత్నిస్తారు. మరికొందరు ప్రమాదకరమైన విపరీత భంగిమల్లో పాల్గొంటారు. అలాంటి ప్రయత్నమే బెడిసి కొట్టి ఓ వ్యక్తి జననాంగం విరిగిపోయింది. దాంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. ఇండోనేషియా దేశంలోని వెస్ట్‌ నుసా టెంగారా ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో అత్యంత ప్రమాదకరమైన శృంగార భంగిమ కోసం ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో అతని జననావయవం విరిగిపోయింది. విపరీతమైన నొప్పిని భరించలేక అతను విలవిల్లాడిపోయాడు. దాంతో అతని భార్య వెంటనే భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిశీలించిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో అతని మర్మావయం బాగా వాచిపోయింది. రంగు కూడా మారిపోయింది.

వెంటనే స్కానింగ్‌, ఎక్స్‌రేలు తీయించి పరీక్షించగా జననావయవంలోని స్తంభన కణజాలంలో పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. అదేవిధంగా మూత్రనాళం వెంట రక్తస్రావాన్ని గమనించారు. అత్యవసర శస్త్రచికిత్స చేయకపోతే అతని జననావయవం పూర్తిగా పనిచేయకుండా పోతుందని, మూత్ర విసర్జన కూడా కష్టంగా మారుతుందని చెప్పి వెంటనే సర్జరీ చేశారు. కొన్ని రోజుల అనంతరం అతను కోలుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన కేస్ స్టడీ ఇప్పుడు యూరాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.