Russell’s viper । తనను కాటువేసిన రక్త పింజరను హాస్పిటల్‌కు తీసుకొచ్చిన వ్యక్తి

ఒంటిపై బనీను, లుంగీతో ఉన్న మండల్‌.. పాము మెడ దగ్గర గట్టిగా పట్టుకుని ఎమర్జెన్సీ వార్డుకు వచ్చాడు. తనను కాటువేసిన ప్రాంతంలో విషం ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా గట్టిగా కట్టు కట్టుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న రోగులు.. భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. హాస్పిటల్‌ సిబ్బందిలో ఒకరు అతడిని జాగ్రత్తగా పట్టుకుని హాస్పిటల్‌లోని మరో చోటుకు తీసుకుపోయారు.

Russell’s viper । తనను కాటువేసిన రక్త పింజరను హాస్పిటల్‌కు తీసుకొచ్చిన వ్యక్తి

Russell’s viper । రక్త పింజర.. భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఇది కాటు వేసిందంటే సరైన సమయంలో వైద్య సహాయం అందకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అటువంటి రక్త పింజర బీహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన ఒక వ్యక్తిని కాటు వేసింది. దీంతో సదరు వ్యక్తి.. ఆ రక్తపింజరను ఒడిసిపట్టుకుని.. దానిని మెళ్లో వేసుకుని హాస్పిటల్‌కు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్పూర్‌ జిల్లా మిరాచక్‌ గ్రామానికి చెందిన ప్రకాశ్‌ మండల్‌ అనే వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరను మెడలో వేసుకుని జేఎల్‌ఎన్‌ హాస్సిటల్‌కు వచ్చాడు. ఈ దృశ్యం చూసిన హాస్పిటల్‌లోని రోగులు, వారి సహాయకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

ఒంటిపై బనీను, లుంగీతో ఉన్న మండల్‌.. పాము మెడ దగ్గర గట్టిగా పట్టుకుని ఎమర్జెన్సీ వార్డుకు వచ్చాడు. తనను కాటువేసిన ప్రాంతంలో విషం ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా గట్టిగా కట్టు కట్టుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న రోగులు.. భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. హాస్పిటల్‌ సిబ్బందిలో ఒకరు అతడిని జాగ్రత్తగా పట్టుకుని హాస్పిటల్‌లోని మరో చోటుకు తీసుకుపోయారు. వైద్య సిబ్బంది నచ్చజెప్పడంతో పామును వదిలిపెట్టి చికిత్స తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. భాగల్పూర్‌లో ఇటీవల పెద్ద ఎత్తున వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదలతో రక్తపింజర వంటి పాములు, మొసళ్లు ఆవాస ప్రాంతాల్లో తరచూ కనిపిస్తున్నాయి.