Giant Persons | రాక్షసులు నిజంగానే ఈ భూమిపై ఉండేవారా? వారి కథేంటి?

చందమామ కథల్లో లేదా పాత పౌరాణిక, జాన పద చిత్రాల్లో రాక్షసులు గుర్తున్నారా? మనిషికంటే రెట్టింపు ఎత్తుతో భారీ కాయంతో ఉండేవారు. జానపద కథలకు, సినిమాల్లో ఫిక్షన్‌ పాత్రలే కాదు.. నిజంగానే నరమాంస భక్షకులు, క్రూర స్వభావులు అయిన పది అడుగుల ఎత్తున్న మనుషులు ఈ భూమిపై కొన్ని వేల ఏళ్ల క్రితం నడిచారని పరిశోధకులు చెబుతున్నారు.

Giant Persons | రాక్షసులు నిజంగానే ఈ భూమిపై ఉండేవారా? వారి కథేంటి?

Giant Persons | అవతార్‌ సినిమాలో గ్రహాంతర వాసులు ఎంత ఎత్తు ఉండేవారో కదా! గతంలో తెలంగాణలో గట్టయ్య అనే పొడగరి.. 7.6 అడుగుల ఎత్తుతో ఉండేవాడు! మన పాత సినిమాల్లో రాక్షసులు  మనకు రెట్టింపు ఎత్తుతో కనిపించేవారు. ఇలాంటివాళ్లను చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ల ముందు మనం చిన్న పిల్లల్లా కనిపిస్తూ ఉంటాం. ఇలా పొడవాటి శరీరాకృతి కలిగిన వ్యక్తులు (Giant Persons) ఫిక్షన్‌ క్యారెక్టర్లు మాత్రమే కాదని.. ఒకప్పుడు కనీసం పది అడుగుల ఎత్తయినవారు ఈ భూప్రపంచం మీద నడిచారని పరిశోధకులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు తమకు లభించాయంటున్నారు. వీటి ప్రకారం.. పది అడుగుల వరకూ ఎత్తు ఉన్న మనుషులు కొన్ని వేళ ఏళ్ల క్రితం ఈ భూమిపై నడయాడారని చారిత్రక రికార్డుల ఆధారంగా చెబుతున్నారు.

నెవెడా స్టేట్‌లో భారీ అస్తిపంజరాలు

అమెరికాలోని నెవెడా స్టేట్‌లో భారీ అస్తిపంజరాలను, మమ్మీలను ఆర్కియాలజిస్టులు గుర్తించారు. వారు వెలికి తీసిన అస్తిపంజరం.. సుమారు పది అడుగులు ఉన్నది. దీని వెంట్రుకలు ఎర్రటి రంగులో ఉన్నాయి. ఇదే కాకుండా ఇదే సైజులో ఉన్న కొన్ని మమ్మీలను కూడా కనుగొన్నారు. వీళ్లు గిరిజన తెగలవారని, వారి ప్రస్తావనలు పుస్తకాల్లో చోటు చేసుకోలేదని పరిశోధకులు అంటున్నారు. ఈ తెగవారు నరమాంస భక్షకులు, క్రూరమైన మనస్తత్వం కలిగినవారిగా అంచనా వేస్తున్నారు. సాధారణ ఎత్తుతో ఉన్న మనుషులపై ఆధిపత్యం చెలాయించేవారని అంటున్నారు. వారిని సి-టె-కా అని పిలిచేవారని, రెల్లుతో చేసిన తెప్పలపై అమెరికాకు వచ్చారు. కొంతకాలానికే నైరుతి అమెరికాలో ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించారని ఇండి100 పేర్కొన్నది.

1911లో తొలిసారి క్లూ

పదడుగుల ఎత్తున్న వ్యక్తులకు సంబంధించి తొలిసారి 1911లో క్లూ లభించింది. వ్యవసాయానికి గబ్బిలాల మలాన్ని ఎరువుగా వాడుతారు. దీనికోసం కొందరు నెవెడాలోని లవ్‌లాక్‌లోని ఒక గుహలో తవ్వకాలు జరుపుతుండగా.. వారికి కొన్ని వింత వస్తువులు కనిపించాయి. ఆది శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి పదమూడేళ్లపాటు తవ్వకాలు కొనసాగించారు. తవ్వకాల సందర్భంగా 1912, 1924 సంవత్సరాల్లో మరిన్ని కళాఖండాలు బయల్పడ్డాయి. వాటిలో లవ్‌లాక్‌ మమ్మీలు కూడా ఉన్నట్టు ఆర్కియాలజీ వరల్డ్‌ తెలిపింది. ఇవి ఒక్కోటీ 8 నుంచి పది అడుగుల ఎత్తు ఉన్నాయి. 15 అంగుళాలు ఉన్న పాదరక్షలు, ఒక భారీ చేతి ముద్రను కూడా గుర్తించారు.

1931లో మరో రెండు

1931లో రెండు భారీ అస్తిపంజరాలను లవ్‌లాక్‌ సమీప చెరువు తీరంలో కనుగొన్నారు. ఈ రెండూ మమ్మిఫై చేసి ఉన్నాయి. ఒకటి 8.5 అడుగులుంటే.. మరోటి 10 అడుగులు ఉంది. వాస్తవానికి లవ్‌లాక్‌ పొడగరులు అమెరికా జానపద కథల్లో ప్రస్తావనకు వస్తూ ఉంటారు. ప్రజలు వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ.. వారు నిజంగా ఉండేవారా? లేదా? అన్నది తెలియదు.
పెరు, ఆండెస్‌లలో సైతం గతంలో ఇలాంటి పొడగరులు ఉండేవారని కనుగొన్నారు. అక్కడ పొడవైన పుర్రెలు కనిపించడం ఒకప్పుడు ఈ భూమిపై పది అడుగుల ఎత్తయినవారు నివసించారనే సిద్ధాంతానికి ఊతమిచ్చింది. ఈ అస్తిపంజరాలు మూడు వేల ఏళ్ల క్రితం నాటివని గుర్తించారు. వీటిలో కొన్నింటికి ఎర్రటి వెంట్రుకలు ఉన్నాయి. అమెరికా స్థానిక తెగల్లో రెండు ప్రత్యేక తెగలవారు తమపై సీ- టె- కా వారు భయానకంగా ప్రవర్తిస్తూ దాడులు చేశారని నమ్ముతుంటారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ భారీ కాయులను లవ్‌లాక్‌ గుహలోకి వెళ్లేలా చేసి, ప్రవేశ ద్వారం వద్ద మంటలు పెట్టి వారికి ఊపిరి ఆడకుండా చంపేశారని చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి..

OMC Case | ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. సబితకు ఊరట
Dog Jumped: గోడ దూకిన కుక్క..ఎందుకంటే…!?
New Pope | వాటికన్‌ కొత్త పోప్‌ ఆయనేనా? బుధవారం నుంచి కార్డినల్స్‌ కాంక్లేవ్‌
Telangana | ఆర్థిక దిగ్బంధంలో రేవంత్‌ సర్కార్‌! ఆదాయానికీ.. ఖ‌ర్చుల‌కు కుద‌ర‌ని పొంత‌న‌
Indo Pak War | 2025లోనే భారత్‌, పాక్ యుద్ధం.. 2019లో ఎలా చెప్పారు? అణ్వాయుధాల వాడకంపై ఏమ‌న్నారంటే?