నేడు జాతీయ క్రీడా దినోత్సవం
విధాత: ధ్యాన్ చంద్ ఈ పేరు వినబడితే చాలు ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టడమే కాకుండా ఒంట్లో వణుకు పుడుతుంది. ఆయనే మణికట్టు మాంత్రికుడు, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్. ఆయన జయంతిని దేశం మొత్తం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. ధ్యాన్ చంద్ ఆగస్టు 29, 1905 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో జన్మించగా 1979 డిసెంబరు 3వ తేదీన ఢిల్లీలో మరణించారు. ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీలో ప్రపంచ అత్యుత్తమ […]

విధాత: ధ్యాన్ చంద్ ఈ పేరు వినబడితే చాలు ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టడమే కాకుండా ఒంట్లో వణుకు పుడుతుంది. ఆయనే మణికట్టు మాంత్రికుడు, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్. ఆయన జయంతిని దేశం మొత్తం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. ధ్యాన్ చంద్ ఆగస్టు 29, 1905 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో జన్మించగా 1979 డిసెంబరు 3వ తేదీన ఢిల్లీలో మరణించారు. ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు. గోల్స్ చేయడంలో మణికట్టు మాంత్రికుడిగా పేరు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించడంలో ఆయనదే కీలకపాత్రని చెప్పకతప్పదు. 1922 నుండి 1956 వరకు భారత సైన్యంలో ఉద్యోగం చేసినా ధ్యాన్ చంద్ 1926 నుండి1949 వరకు భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1928లో ఆంస్టర్డ్యామ్ లో, 1932లో లాస్ ఏంజెల్స్, 1936లో బెర్లిన్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారత జట్టు స్వర్ణ పతకాలు సాధించడంలో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించారు. 185 మ్యాచ్ లు ఆడిన ధ్యాన్ చంద్ 570 గోల్స్ చేశారు. 1956లో ధ్యాన్ చంద్ కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆగస్టు 29న ధ్యాన్ చంద్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదగా కీడల్లో దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన క్రీడాకారులకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు ధ్యాన్ చంద్ అవార్డును అందచేయడం జరుగుతోంది. యువ వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా ఏటా ప్రదానం చేసే అవార్డ్ లలో ఒకటైనా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఈ ఏడాది నుండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా నామకరణం చేశారు. ఈ ఏడాది అవార్డులు ప్రకటించడం ఆలస్యం కావడంతో ఇవ్వడం లేదు. 2002లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకి ధ్యాన్ చంద్ జ్ఞాపకార్థం గా ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా నామకరణ చేశారు. దేశానికి వరుసగా మూడు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలను అందించిన ధ్యాన్ చంద్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.