అబ్బో నా కోడిపెట్ట‌..! నాలుగు గంట‌ల్లో 11 గుడ్లు..!

విధాత‌: రోజుకు ఒక‌ కోడి ఎన్ని గుడ్లు పెడుతుందంటే మ‌నం ఏం చిప్తాం ఒక‌టి లేదా రెండు అని చెప్తాం కాని ఈ కోడి మామూలు కోడి కాదండోయ్..ఏకంగా 11గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళలోని కోజికోడ్ జిల్లా బాలుస్సెరీ సమీపంలో ఉన్న కొలతూరులో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కొలతూరుకి చెందిన మనోజ్ కి కోళ్ల‌ను పెంచుకునే అల‌వాటువుంది. అయితే తాను పెంచుకుంటున్న కోళ్ల‌ల్లో ఈ కోడి మాత్రం భిన్నంగా నాలుగు గంటల వ్య‌వ‌ధిలోనే […]

అబ్బో నా కోడిపెట్ట‌..! నాలుగు గంట‌ల్లో 11 గుడ్లు..!

విధాత‌: రోజుకు ఒక‌ కోడి ఎన్ని గుడ్లు పెడుతుందంటే మ‌నం ఏం చిప్తాం ఒక‌టి లేదా రెండు అని చెప్తాం కాని ఈ కోడి మామూలు కోడి కాదండోయ్..ఏకంగా 11గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కేరళలోని కోజికోడ్ జిల్లా బాలుస్సెరీ సమీపంలో ఉన్న కొలతూరులో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కొలతూరుకి చెందిన మనోజ్ కి కోళ్ల‌ను పెంచుకునే అల‌వాటువుంది. అయితే తాను పెంచుకుంటున్న కోళ్ల‌ల్లో ఈ కోడి మాత్రం భిన్నంగా నాలుగు గంటల వ్య‌వ‌ధిలోనే మొత్తం 11 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లలో 10 మాములు సైజులో ఉండగా అందులో ఒక గుడ్డు మాత్రం కాస్త పెద్ద సైజులో ఉంది. ఈ కోడి గురించి తెలిసిన స్థానికులు దాన్ని చూసేందుకు మనోజ్ ఇంటికి వర‌స‌లుక‌ట్టారు. ఈకోడిని తాను 4 నెలల క్రితం బంధువుల ఇంటి నుంచి తీసుకొచ్చినట్లు మనోజ్ తెలిపారు. హార్మోన్ల ప్రభావం వల్లే సాధారణం కంటే ఎక్కువ గుడ్లను పెట్టి ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.