Apple Obsolete List | కాలంచెల్లిన ఆపిల్​ ఉత్పత్తులు – లిస్ట్​ ఇదిగో.!

ఐఫోన్​ 17 ఆవిష్కరణకు ముందు ఆపిల్​ తన పాత మోడళ్లను కాలం చెల్లిన ఉపకరణాల జాబితాలో చేర్చింది. ఇందులో ఐఫోన్​ 8 ప్లస్​, ఐఫోన్​ ఎక్స్​ఎస్​, పాత మ్యాక్​బుక్​​లు ఉన్నాయి. వీటికి ఇక సపోర్ట్​ పరిమితమే.

Apple Obsolete List | కాలంచెల్లిన ఆపిల్​ ఉత్పత్తులు – లిస్ట్​ ఇదిగో.!

Apple Obsolete List | ఐఫోన్ 17 సిరీస్ గ్లోబల్ లాంచ్ సెప్టెంబర్ 9న జరగబోతున్న వేళ, ఆపిల్ తన ఉత్పత్తుల లైఫ్‌సైకిల్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఐఫోన్లకు మార్గం సుగమం చేసే కార్యక్రమంలో భాగంగా పాత మోడల్స్‌కు వీడ్కోలు పలికింది. అందులో భాగంగా ఐఫోన్​ 8 ప్లస్​, ఐఫోన్​ ఎక్స్​ఎస్ మోడల్స్‌ను Vintage జాబితాలో చేర్చగా, మ్యాక్​బుక్  ఎయిర్​ (2015), మ్యాక్​బుక్  ప్రొ (2017 – Touch Bar మోడల్స్) లాంటి మ్యాక్​బుక్ ల‌ను Obsolete కేటగిరీలోకి తరలించింది. దీని అర్థం ఏమిటంటే – ఈ పాత డివైస్‌లకు ఇక ఆపిల్ సపోర్ట్ పరిమితమవుతుంది, కొత్త అప్‌డేట్స్ లేదా పూర్తి రిపేర్ సదుపాయాలు అందుబాటులో ఉండవు.

Vintage & Obsolete అంటే..?

  • Vintage: అమ్మకాలు ఆగి 5–7 సంవత్సరాలైన మోడల్స్. పరిమిత సపోర్ట్​
  • Obsolete: 7 సంవత్సరాలకు మించి support లేని మోడల్స్. వీటికి ఏ సౌలభ్యం ఉండదు. స్పేర్లు కూడా దొరకవు.

ప్రభావిత మోడల్స్

  • ఐఫోన్​ 8 ప్లస్ (64GB, 256GB)
  • ఐఫోన్​ ఎక్స్​ఎస్
  • మ్యాక్​బుక్ ఎయిర్​ 11-inch (2015)
  • మ్యాక్​బుక్ ప్రొ 13-inch & 15-inch (2017)

ఈ చర్య వల్ల యూజర్లకు OS updates రావు. రిపేర్లు కూడా పరిమిత కాలానికి మాత్రమే ఉంటాయి. ఆపిల్ పాత మోడల్స్ obsoleteగా మారడంతో, యూజర్లు కొత్త డివైజ్​లు కొనుగోలు చేసే దిశగా అడుగులు వేయనున్నారు. ఇది ఆపిల్​ అమ్మకాలను పెంచుతూనే, పాత మోడల్స్ వాడుతున్న వారికి ఇబ్బందులు కలిగించవచ్చు.