Retro Baby Selfie Trend | గూగుల్‌ కొత్త రెట్రోబేబీ సెల్ఫీ ట్రెండ్‌! మీ చిన్నప్పటి ఫొటో.. మీ ఇప్పటి ఫొటో అప్‌లోడ్‌ చేసి చూడండి!

రోజుకో కొత్త ట్రెండ్‌ వస్తున్నది. తాజాగా రెట్రోబేబీ ట్రెండ్‌. మరి దీనిలో ఫొటో ఎలా తయారు చేసుకోవాలి?

Retro Baby Selfie Trend | గూగుల్‌ కొత్త రెట్రోబేబీ సెల్ఫీ ట్రెండ్‌! మీ చిన్నప్పటి ఫొటో.. మీ ఇప్పటి ఫొటో అప్‌లోడ్‌ చేసి చూడండి!

Retro Baby Selfie Trend  | మీరు మీ చిన్నారితో సెల్ఫీలు తీసుకోవడం సహజమే! కానీ.. మీ చేతిలో మీరే అందులోనూ మీ చిన్ననాటి రూపంలో ఉండగా సెల్ఫీ సాధ్యమా? సాధ్యమేనంటున్నది గూగుల్‌ ఏఐ బాట్‌ జమిని. కొద్ది రోజులుగా ఏఐ ఇమేజింగ్‌లో కొత్త ట్రెండ్స్‌ పరిచయం చేస్తున్న గూగుల్‌.. నానా బనానాగా చెబుతున్న కొత్త జెమినై 2.5 ఫ్లాష్‌ ఇమేజ్‌ మోడల్‌ ను తీసుకొచ్చింది. ఈ ఏఐ టూల్‌ను తీసుకువచ్చిన నెల రోజులలోపే 500 కోట్ల చిత్రాలను యూజర్స్‌ తయారు చేసుకున్నారంటే ఇది ఎంత ప్రఖ్యాతి పొందిందో అర్థమవుతున్నది. జమినై యాప్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌, ఎడిటర్‌ ద్వారా త్రీడీ మోడల్స్‌, పాతకాలపు చీరలతో ఫొటోలు, పోలరాయిడ్‌ కెమెరాతో సెలబ్రిటీలతో తీసుకున్నట్టు సెల్ఫీలు తయారు చేసుకోవచ్చు.

తాజాగా గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జోష్‌ వుడ్‌వార్డ్‌ ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. “🍌@GeminiApp నెల వ్యవధిలోనే ఇప్పటికే 500 కోట్ల చిత్రాలను రూపొందించింది. What a ride, still going! Latest trend: retro selfies of you holding a baby version of you. Can’t make this stuff up!” అని ఆయన రాశారు.

వుడ్‌వార్డ్‌ పోస్టుకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచై స్పందిస్తూ.. తన పెంపుడు కుక్కతో ఉన్న తన త్రీడీ మోడల్‌ను నానో బనానా ఉపయోగించి పోస్ట్ చేశారు. దాని కింద “Make that 5 billion and 1 😂” అని రాశారు.

రెట్రో సెల్ఫీ తయారీ ఎలా?
ముందుగా జమినై యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి.
అక్కడ నానా బనానా ఐకాన్‌ మీద క్లిక్‌ చేయండి.
మీకు నచ్చిన ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేసి.. ప్రాంప్ట్‌ ఇవ్వండి.
ఉదాహరణకు :
​“Create a fun, high-quality retro-style selfie where the adult in [Image 1] is holding the baby from [Image 2] as if they’re taking a casual smartphone selfie together. అని ప్రాంప్ట్‌ ఇవ్వండి.
లైటింగ్‌, స్కిన్‌టోన్‌ రెండూ ఒకేలా ఉండేలా చూసుకోండి.

  • పాతకాలపు అంటే వింటేజ్‌ ఫిల్మ్‌ ఫిల్టర్‌ను యాడ్‌ చేయండి.
  • రెండు ఫొటోలూ చక్కగా ఉండేలా చూసుకోండి.
  • బ్యాక్‌ గ్రౌండ్‌ ఎలా ఉండాలో సెట్‌ చేసుకోండి.
  • అంతే.. మీకు అద్భుతమైన ఫొటో డౌన్‌లోడ్‌కు సిద్ధమవుతుంది. దానిని డౌన్‌లోడ్‌ చేసుకుని మీకు నచ్చినవారికి షేర్‌ చేసుకోండి.