రాష్ట్రంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి 100కోట్ల వ్యయం

రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటివరకు తాగునీటి సమస్య రానివ్వలేదని, 100 కోట్ల వ్యయంతో చేతిపంపులు, మోటార్లు, పైప్ లైన్లు మరమ్మత్తు చేయించామని

రాష్ట్రంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి 100కోట్ల వ్యయం

గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటివరకు తాగునీటి సమస్య రానివ్వలేదని, 100 కోట్ల వ్యయంతో చేతిపంపులు, మోటార్లు, పైప్ లైన్లు మరమ్మత్తు చేయించామని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. 19,605 చేతిపంపులు, 14,708 సింగిల్ ఫేజ్ మోటార్లు, 605 పంపుసెట్లు, మంచి బావులు, 662 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్లు మరమ్మత్తు చేయించామన్నారు. వేసవి నేపథ్యంలో జలాశయాల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకుంటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. అధికారులు ఎక్కడైనా తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.