Urea | బ‌ర్త్ డే గిఫ్ట్‌గా ‘యూరియా’ బ‌స్తా..! ఎక్క‌డో తెలుసా..?

Urea | ప్ర‌తి ఒక్క‌రు త‌మ పుట్టిన రోజు( Birth Day )ను ఘ‌నంగా నిర్వ‌హించుకుంటారు. ఈ పుట్టిన రోజు సంద‌ర్భంగా స‌ద‌రు బ‌ర్త్ డే వ్య‌క్తికి కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు విలువైన కానుక‌లు బ‌హుమ‌తి( Gift )గా ఇస్తుంటారు. కానీ ఈ వ్య‌క్తి పుట్టిన రోజుకు మాత్రం అన్న‌దాత‌లు( Farmers ) యూరియా( Urea ) బ‌స్తాను బ‌హుమ‌తిగా ఇచ్చి వార్త‌ల్లో నిలిచారు.

Urea | బ‌ర్త్ డే గిఫ్ట్‌గా ‘యూరియా’ బ‌స్తా..! ఎక్క‌డో తెలుసా..?

Urea | తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా యూరియా( Urea ) బ‌స్తాల కోసం వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యాల ఎదుట అన్న‌దాత‌లు( Farmers ) బారులు తీరుతున్న సంగ‌తి తెలిసిందే. అర్ధ‌రాత్రి స‌మ‌యంలోనే రైతులు వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘాల ఆఫీసుల వ‌ద్ద‌కు చేరుకుని యూరియా బ‌స్తాల కోసం ఎదురుచూస్తున్నారు. త‌మ పాస్ బుక్‌( Pass Books )లు లేదా ఆధార్ కార్డులు లైన్‌లో పెట్టి గంట‌ల పాటు ప‌డిగాపులు కాస్తున్నారు.

ఈ క్ర‌మంలో వేముల‌వాడ రైతులు( Vemulawada Farmers ) వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. ఓ రైతు పుట్టిన రోజు( Birthday ) సంద‌ర్భంగా ఆయ‌న‌కు యూరియా బ‌స్తాను బ‌హుమ‌తిగా ఇచ్చి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రైతుల‌కు స‌రిప‌డా యూరియా బ‌స్తాలు లేవు అని, ఒక్క రైతుకు ఒక్క యూరియా బ‌స్తా మాత్ర‌మే ఇస్తున్న క్ర‌మంలో ఇలా నిర‌స‌న వ్య‌క్తం చేసిన‌ట్లు అన్న‌దాత‌లు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని శత్రాజుపల్లి గ్రామంలో రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్నందున మనిషికి ఒక యూరియా బస్తా ఇస్తున్న తరుణంలో ఒక యూరియా బస్తా పుట్టినరోజు బహుమతిగా ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఒకప్పుడు యూరియా కోసం ఇంత కష్టం ఉండేది కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కోసం పడిగాపులు కాస్తే ఒకరికి కేవలం ఒకే యూరియా బస్తా మాత్ర‌మే ఇస్తున్నార‌ని రైతులు పేర్కొన్నారు.