తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహింద్రా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబోతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి చైర్మన్‌గా వ్యవహారించాలని దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రాను కోరడం జరిగిందని

అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
రెండు మూడు రోజుల్లో జవాబిస్తానన్న మహింద్రా
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబోతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి చైర్మన్‌గా వ్యవహారించాలని దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రాను కోరడం జరిగిందని, ఆయన రెండు మూడురోజుల్లో సమాధానమిస్తానని చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయం వెల్లడించారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో స్కిల్స్ నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ యూనివర్శిటీకి చైర్మన్‌గా వ్యవహరించాల్సిందిగా ఆనంద్ మహింద్రాను కోరానని, రెండు మూడు రోజుల్లో రిప్లై ఇస్తానంటూ ఆయన సానుకూలంగా స్పందించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. నాలుగు రాజుల క్రితం టెక్ మహింద్రా యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మహింద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వేదికగా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.