MCPI | కార్పొరేట్ శక్తుల తొత్తుగా బీజేపీ … యంసిపిఐ (యు) పొలిట్ బ్యూరో సభ్యులు ఉపేందర్ రెడ్డి

కార్పొరేట్ శక్తుల తొత్తుగా బీజేపీ వ్యవహరిస్తుందని యంసీపీఐ(యు) పోలిట్ బ్యూరో సభ్యులు వల్లేపు ఉపేందర్ రెడ్డి విమర్శించారు.ఈ బడ్జెట్ నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం కొట్టిన చందంగా ఉంది.

MCPI | కార్పొరేట్ శక్తుల తొత్తుగా బీజేపీ … యంసిపిఐ (యు) పొలిట్ బ్యూరో సభ్యులు ఉపేందర్ రెడ్డి

– దేశ భవిష్యత్తును దెబ్బ తీస్తున్న మనువాదులు

– ఆర్ యస్ యస్, బిజెపి కొట్లాట నాటకం

– మనువాద ఫాసిస్టు ప్రమాదం తగ్గలేదు

విధాత, వరంగల్ ప్రతినిధి: కార్పొరేట్ శక్తుల తొత్తుగా బీజేపీ వ్యవహరిస్తుందని యంసీపీఐ(యు) పోలిట్ బ్యూరో సభ్యులు వల్లేపు ఉపేందర్ రెడ్డి విమర్శించారు.ఈ బడ్జెట్ నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం కొట్టిన చందంగా ఉంది. ఇది పెట్టుబడిదారీ, కార్పోరేట్ వర్గాల ప్రయోజనం కోసం ఈ బడ్జెట్ కెటాయింపులు ఉన్నాయని ప్రజలు ఎక్కడికి అక్కడ ప్రజా ఆందోళనలు చేయాలని అని పిలుపునిచ్చారు.

పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ సమావేశం వరంగల్ ఓంకర్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సమానమైన పద్దతుల్లో ఆయా రాష్ట్రాల ఆదాయం ప్రాతిపదికన నిధులు కెటాయించలేదని విమర్శించారు. బిజెపి పాలిత, బిజెపి మద్దతు రాష్ట్రాలకు అధిక నిధులు కెటాయించి, మిగిలిన రాష్ట్రాలకు అరకొర నిధులు కెటాయించటం కేంద్ర బిజెపి పాలనలో పక్షపాతానికి నిదదర్శనమని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను, రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బకొట్టడమే అని అన్నారు. బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమాన నిష్పత్తిలో కెటాయింపులు జరుగలేదని అన్నారు. డెబ్బై శాతం ఉన్న వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో 40శాతం నిధులు కెటాయించాలసి ఉండగా 1.52 లక్షల కోట్లను కెటాయించటం, విద్యారంగానికి బడ్జెట్లో 30’/, బడ్జెట్ కెటాయించాలసి ఉండగా కేవలం 1.48 లక్షల కోట్లు కెటాయించటం సబబు కాదన్నారు. బిజెపి కేంద్రంలో విడుదల చేసిన జీవో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆర్ యస్ యస్ లో పని చేయ వచ్చు అని జీవో లౌకికవాదం, ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు. తక్షణమే ఈ జీవో ను రద్దు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో యంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి, హన్మకొండ జిల్లా కార్యదర్శిఎన్ రెడ్డి హంస రెడ్డి, సహయ కార్యదర్శి నీల రవీందర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాస్ సావిత్రి,కర్ర రాజిరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు మొగిలి శ్రీనివాసరావు, కూతురు ఇంద్రా రెడ్డి, యం డి ఉస్మాన్, కుసం బుచ్చయ్య, వక్కాల కిషన్, దామరకొండ రమేష్, రాజేశ్వర రావు , ప్రభాకర్ మంద భద్రయ్య రవీందర్, బాపు రావు పాల్గొన్నారు.