కాంగ్రెస్‌లోకి బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు?

బీఆరెస్ బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మంగళవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు.

కాంగ్రెస్‌లోకి బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు?

విధాత : బీఆరెస్ బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మంగళవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. బోథ్ నియోజవకర్గంలోని వివిధ మండలాల బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతో కలిసి రేవంత్ నివాసంలో ఆయనను కలిశారు. సిటింగ్ ఎమ్మెల్యే బాపురావును కాదని అనిల్ జాదవ్‌కు టికెట్ ఇవ్వడంతో ఆయన బీఆరెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బాపూరావు కాంగ్రెస్లో చేరికతో బోథ్‌లో రాజకీయ సమీకరణలు మారిపోనున్నాయి.