బీఎస్పీ ప‌దిలంగా ప‌ది హామీలు

బీఎస్పీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. తెలంగాణ బహుజన భరోసా పేరుతో పదిలంగా పది హామీల పేరుతో ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు

బీఎస్పీ ప‌దిలంగా ప‌ది హామీలు
  • బహుజన భరోసా పేరుతో బీఎస్పీ మానిఫెస్టో

విధాత : బీఎస్పీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. తెలంగాణ బహుజన భరోసా పేరుతో పదిలంగా పది హామీల పేరుతో ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. బీఆరెస్‌, కాంగ్రెస్‌ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలకు ధీటుగా బీఎస్పీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. కాన్షి యువ సర్కార్‌ పథకం కింద ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాలు, అందులో మహిళలకు 5లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. షాడో మంత్రులుగా విద్యార్థులను నియమిస్తామని పేర్కోన్నారు.

బహుజన రైతు బీమా పథకం కింద ప్రతి పంటకు కనీస మద్ధతు ధర, ధరణి పోర్టల్‌ రద్దు, పూలే విద్యా దీవేన పథకం కింద మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌, మండలానికి ఏటా 100మంది విద్యార్థులకు విదేశి విద్యా వసతి క‌ల్పిస్తామ‌న్నారు. బ్లూ జాబ్‌ కార్డు కింద కూలీలకు 150రోజుల ఉపాధి హామీ, రోజు కూలీ 350 రూపాయలు, ఉచిత రవాణ, ఆరోగ్య వసతి, జీవిత బీమా వసతి, దొడ్డి కొమురయ్య భూమి హక్కు కింద భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరుతో పట్టా, నూరేళ్ల ఆరోగ్య బీమా కింద ప్రతి కుటుంబానికి 15లక్షల ఆరోగ్య బీమా ప్ర‌క‌టించారు.


ఏటా 25వేలకోట్లతో పౌష్టికాహార ప్యాకేజీ, చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి కింద మహిళా కార్మికుల, రైతులకు ఉచిత వాషింగ్‌ మిషన్లు, స్మార్ట్‌ ఫోన్లు అందిస్తామ‌న్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల క్రమబద్ధీకరణ, మహిళా సంఘాలకు ఏటా లక్ష సహాయం అందిస్తామ‌న్నారు. వలస కార్మికుల సంక్షేమ నిధి కింద 5వేల కోట్ల నిధితో గల్ఫ్‌ కార్మికులకు సంక్షేమ బోర్డు, 600 సబ్హిడీ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు.


 భీమ్‌ రక్షణ కేంద్రం కింద వృద్ధులకు హాస్టల్‌, ఆహారం, ఉచిత వైద్యం, షేక్‌ బందగీ గృహ భరోసా కింద ఇళ్లు లేని వారికి 550గజాల ఇంటి స్థలం, ఇళ్లు కట్టుకునే వారికి 6లక్షల సహాయం, ఇంటి పునర్‌నిర్మాణానికి 1.5లక్షల సహాయం అందించనున్నట్లుగా ప్రకటించారు.