ముగిసిన రేవంత్ మంత్రివర్గం తొలి భేటీ

తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గం సమావేశం సెక్రటేరియట్‌లో రెండున్నర గంటల పాటు కొనసాగింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం

ముగిసిన రేవంత్ మంత్రివర్గం తొలి భేటీ

విధాత : తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గం సమావేశం సెక్రటేరియట్‌లో రెండున్నర గంటల పాటు కొనసాగింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపైన ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. అంతకుముందు సీఎం హోదాలో తొలిసారిగా సెక్రటేరియట్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డికి సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా సహా అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం పిదప ఆరో అంతస్తులోని తన చాంబర్‌లో రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కొంత సేపు ఆయన ఉన్నతాధికారులతో పాలన విధులపై సమీక్ష చేశారు.