విధాత : సీపీఐ నేత నారాయణ దంపతులు ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు. తమ జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి నారాయణ దంపతులు దానం చేయాలని నిర్ణయించారు. సమాజ సేవే లక్ష్యంగా నారాయణ తన ఆస్తిని విరాళంగా ఇచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని నారాయణ దంపతులు చెప్పారు. సంపాదించినదంతా సమాజానికే అంకితం చేస్తున్నామని స్పష్టం చేశారు.
వందలాది వృద్దులకు ఆసరాగా నారాయణ
నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా నారాయణ దంపతులు నిలిచారు. వృద్ధుల సంక్షేమం కోసం తమ ఆస్తి వినియోగించాలని నిర్ణయం తీసుకున్న నారాయణ దంపతుల నిర్ణయం వందలాది మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపనుంది. సేవాభావం, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా వారు నిర్ణయం నిర్ణయం ప్రశంసలు అందుకుటుంది. నేటి రాజకీయాల్లో నారాయణ నిర్ణయం అరుదైన ఉదాహరణగా నెటిజన్లు అభివర్ణిస్తూ..ఆయనకు లాల్ సలామ్ చెబుతున్నారు. సిద్దాంతాలు చెప్పడమే కాదు..ఆచరించి చూపిన వ్యక్తిగా నారాయరణ చరిత్రలో నిలుస్తారని అభినందిస్తున్నారు.