Mallu Bhatti Vikramarka | ప్రభుత్వో ఉద్యోగులకు త్వరలో డీఏ.. శుభవార్త వింటారన్న డిప్యూటీ సీఎం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో డీఏ ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ డీఏకు సంబంధించి త్వరలో శుభవార్త వింటారన్నారు.

Mallu Bhatti Vikramarka | ప్రభుత్వో ఉద్యోగులకు త్వరలో డీఏ.. శుభవార్త వింటారన్న డిప్యూటీ సీఎం

విధాత: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో డీఏ ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ డీఏకు సంబంధించి త్వరలో శుభవార్త వింటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మనకోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తోందని, పెరిగిన ధరలకు అనుగునంగా వారికి చేయాల్సినవన్నీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ధనిక రాష్ర్టంగా ఉన్నప్పడే బీఆరెస్ ప్రభుత్వనేతలు డీఏ ఇవ్వడానికి రెండు నుంచి ఏడేళ్ల పాటు సమయం తీసుకున్నారని, ఇప్పుడు అంత సమయం తీసుకోకుండా ఆ డీఏలు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు.

46.19 లక్షల కుటుంబాలకు జీరో బిల్లులు

రాష్ట్రంలో గృహహజ్యోతి పథకం కింద అహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు 200 యూనిట్లలో పు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని శాసన మండలిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద 46 లక్షల 19 వేల 236 కుటుంబాలకు జీరో కరెంటు బిల్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి 1,79,33,430 మందికి జీరో బిల్లులు ఇచ్చామని తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ లో ఈ పథకం కింద రూ. 2,418 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. గృహజ్యోతి బిల్లులను ప్రభుత్వం ప్రతి నెల డిస్కమ్ లకు చెల్లిస్తోందన్నారు.

బీజేపీ సభ్యులకు హరీష్ చిట్టీలు

హరీష్ రావు ‘ఇది మాట్లాడు.. అది మాట్లాడు’ అని చిట్టీలు అందిస్తున్నారు అధ్యక్షా ఇదెక్కడి న్యాయం? నేను డిప్యూటీ సీఎం కాబట్టి సీఎం నాకు చిట్టీలు అందిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది.. అదే హరీష్ రావు బీఆరెస్ సభ్యులతో పాటు బీజేపీ సభ్యులకు చిట్టీలు అందిస్తున్నారు.. అనడంతో సభలో పెద్ద ఎత్తున నవ్వులు విరిశాయి.