వైన్స్‌లను మూసివేయండి : ఈసీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 30వ తేదీన జరుగనున్న నేపధ్యంలో ప్రచార పర్వం మంగళవారం 28వ తేదీ సాయంత్రం 5గంటలకు ముగియ్యనుంది

వైన్స్‌లను మూసివేయండి : ఈసీ

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 30వ తేదీన జరుగనున్న నేపధ్యంలో ప్రచార పర్వం మంగళవారం 28వ తేదీ సాయంత్రం 5గంటలకు ముగియ్యనుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మూసి వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తమ ఆదేశాలు ఖచ్చితంగా అమలు జరిగే చూడాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాలను ఎవరైన ఉల్లంఘించి దుకాణాలు తెరిచినా, మద్యం అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.