పోటీపై ఈటల సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు
హుజూరాబాద్: భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో జరగనున్న ఉప ఎన్నిక పోటీలో తానున్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటేనని చెప్పారు. నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా జమున మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజేందర్ వెన్నంటే ఉన్నానన్నారు. ఎవరు పోటీ చేయాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గుర్తు అదే […]

హుజూరాబాద్: భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో జరగనున్న ఉప ఎన్నిక పోటీలో తానున్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటేనని చెప్పారు. నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా జమున మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజేందర్ వెన్నంటే ఉన్నానన్నారు. ఎవరు పోటీ చేయాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గుర్తు అదే ఉంటుందన్నారు..