Bonalu Festival | బోనాల ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఎగ్జిబిషన్
Bonalu Festival | బోనాల ఉత్సవాల( Bonalu Festival ) సందర్భంగా బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhaker ) తెలిపారు.

5 రోజుల పాటు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు
పెద్ద ఎత్తున్న బీసీ సంఘాలు పాల్గొనాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
Bonalu Festival | హైదరాబాద్: బోనాల ఉత్సవాల( Bonalu Festival ) సందర్భంగా బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhaker ) తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి 29 వరకు ఐదు రోజుల పాటు ట్యాంక్ బండ్( Tank Bund ) వద్ద అంబేద్కర్ విగ్రహం( Ambedkar Statue) గల ప్రదేశములో ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎగ్జిబిషన్లో బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పెద్ద ఎత్తున చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలని ఈ ప్రదర్శనలో వివిధ బీసీ కుల కళాకారులు చేసిన వస్తువులు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
కుమ్మరులు తయారు చేసిన మట్టిపాత్రలు, గౌడన్నలచే ‘నీరా’ స్టాల్, మేదరి వారు తయారు చేసిన వెదురు వస్తువులు, పూసల వారి సామగ్రి అలాగే పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట మొదలైన చేనేత ఉత్పత్తులు, ఇతర బీసీ వర్గాలు తయారు చేసిన వస్తువులు అందుబాటులో ఉండనున్నాయి. ఇవే కాకుండా తెలంగాణ వంటకాలు, బెస్త సోదరుల చేప వంటకాలు ఇతర భోజన స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయత్రం 9:30 గంటల వరకు ఉంటుంది. బీసీ చేతివృత్తుల వారి పర్యావరణ హితమైన ఉత్పత్తుల ప్రదర్శనకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం కోరారు.