కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహించారు.. రెండు ఎంపీ స్థానాల్లో ఎగిరేది గులాబీ జెండానే
కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు మోసపోయని తెలంగాణ ప్రజలు పసిగట్టారని, పాలేందో ..నీళ్ళేందో ప్రజలకు స్పష్టంగా అర్థమైందని మరోసారి కాంగ్రెస్ నమ్మితే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అనే భావనతో పార్లమెంటు ఎన్నికల్లో

మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
విధాత : కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు మోసపోయని తెలంగాణ ప్రజలు పసిగట్టారని, పాలేందో ..నీళ్ళేందో ప్రజలకు స్పష్టంగా అర్థమైందని మరోసారి కాంగ్రెస్ నమ్మితే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అనే భావనతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కోన్నారు. బుధవారం సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం పాచ్యా నాయక్ తండాలో నల్లగొండ లోక్ సభ స్థానం బీఆరెస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కల్యాణ లక్ష్మీ పధకం ద్వారా లక్ష రూపాయలకు తోడు తులం బంగారం, రైతు రుణ మాఫీ వంటి మోసపూరిత హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేస్తుందని ప్రజలు గ్రహించారన్నారు. కొత్త పథకాలు ఇవ్వక పోగా కేసీఆర్ ఇచ్చినవి కొనసాగించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. కేసీఆర్‌ను వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. ప్రచారానికి వెళ్లిన తమ నాయకులను కలుస్తున్న సబ్బండ వర్గాలు కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగడుతున్న వైనమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కన పెట్టి ప్రజలకు సంబంధం లేని అంశాలతో కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని, వారి నాటకాలను, ఇచ్చిన హామీలను విస్మరించడాన్ని అర్ధం చేసుకున్న ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అన్న జగదీష్ రెడ్డి, బీఆరెస్ హయాంలో పథకాలు అందని ఇల్లు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీల పట్ల నెలకొన్న వ్యతిరేకత…కేసీఆర్ మళ్లీ రావాలన్న ఆలోచనతో ప్రజలు ఎంపీ ఎన్నికల్లో బీఆరెస్‌ను గెలిపించబోతున్నారని జోస్యం చెప్పారు. ఉమ్మడి నల్లగొండ లోని నల్లగొండ, భువనగిరి రెండు లోక్ సభ స్థానాల్లో ఎగిరెది గులాబి జెండానే అని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ కుమారి బాబు నాయక్, జడ్పీటీసీ సంజీవ నాయక్, పార్టీ అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు రౌతు నరసింహారావు, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఉట్కూరి సైదులు, సత్యం, గోవిందరెడ్డి, బాలాజీ నాయక్, అనిల్ నాయక్ తో పాటు బీఆరెస్ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.