రేవంత్‌కు మంత్రివర్గానికి హరీశ్‌రావు గ్రీటింగ్స్
తెలంగాణ కొత్తగా ప్రమాణాస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రివర్గ సహచరులకు మాజీ మంత్రి, బీఆరెస్ నేత టి.హరీశ్‌రావు ట్వీటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు

విధాత : తెలంగాణ కొత్తగా ప్రమాణాస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రివర్గ సహచరులకు మాజీ మంత్రి, బీఆరెస్ నేత టి.హరీశ్‌రావు ట్వీటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలంటూ హరీశ్‌రావు ట్వీట్‌లో పేర్కోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పిదప బీఆరెస్ వైపు నుంచి అభినందనలు తెలిపిన తొలి నేత హరీశ్‌రావు కావడం గమనార్హం.