పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

జూరాల కు భారీగా వరద నీరు20 గేట్స్ ఎత్తివేత విధాత‌: జూరాల ప్రాజెక్ట్ నుండి దిగువకు 20 గేట్లు ఎత్తివేసి శ్రీశైలం వైపు వరద నీరు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మొదటి హెచ్చరికలను కూడా అధికారులు జారీ చేశారుఇన్ ఫ్లో: 1,48,000 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 1,60,987 క్యూసెక్కులు Capacity 8.126 TMC గంట గంటకు జూరాల వరదనీరు పెరుగుదల..జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండల రేవులపల్లి దగ్గర జూరాల […]

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

జూరాల కు భారీగా వరద నీరు
20 గేట్స్ ఎత్తివేత

విధాత‌: జూరాల ప్రాజెక్ట్ నుండి దిగువకు 20 గేట్లు ఎత్తివేసి శ్రీశైలం వైపు వరద నీరు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మొదటి హెచ్చరికలను కూడా అధికారులు జారీ చేశారు
ఇన్ ఫ్లో: 1,48,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 1,60,987 క్యూసెక్కులు

Capacity 8.126 TMC

గంట గంటకు జూరాల వరదనీరు పెరుగుదల..
జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండల రేవులపల్లి దగ్గర జూరాల డ్యాం కి ఎగువ వరదనీరు గంట గంటకు పెరుగుతూ వస్తున్నది. కావున పర్యాటకులు కృష్ణపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు రెవిన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే దిగువ శ్రీశైలం నాకు 1 లక్ష క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నారు. ప్రస్తుతం 20 గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలం వైపు వరద నీటిని వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.