Jangaon | ఈసీ నియమాలను పక్కాగా పాటించాలి : జనగామ కలెక్టర్

మొదటి విడతలో భాగంగా చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథ్ పల్లి, జాఫరఘడ్ లింగాల గణపురం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Reported by: chinna | తెలంగాణ‌ | Nov 27, 2025, 7:01 pm IST
Read Time: 3 mins
Jangaon | ఈసీ నియమాలను పక్కాగా పాటించాలి : జనగామ కలెక్టర్

విధాత, జనగామ :

మొదటి విడతలో భాగంగా చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథ్ పల్లి, జాఫరఘడ్ లింగాల గణపురం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో 5 మండలాల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో… గురువారం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నోటీస్ ప్రదర్శించిన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ సమయంలో ఆర్వో, ఏ ఆర్వో ఏమేమి చెక్ చేయాలో క్షుణ్ణంగా ఆయన వివరించారు

అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు,చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ ఆర్డీఓ వెంకన్న, ఎంపీడీఓ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.