TELANGANA | తెలంగాణ చైతన్య ప్రతీక జయశంకర్.. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య,జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

TELANGANA | తెలంగాణ చైతన్య ప్రతీక జయశంకర్.. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్

విధాత, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య,జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దీనిలోభాగంగా మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్కులోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ గురించి అనేక నివేదికలు వెలువడించిన వ్యక్తి అని తెలంగాణలో జరిగిన ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల మీద,తెలంగాణ వెనుకబాటు తనం, తెలంగాణ నీటి వనరులపై, నియామకాల మీద, నిధుల మీద విస్తృతంగా పరిశోధనలు చేసి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. వరంగల్లో రిజిస్టార్ గా పనిచేసిన వైస్ ఛాన్స్లర్ గా పని చేసి రిటైర్ అయిన తర్వాత పూర్తిస్థాయి ఉద్యమంలోకి అంకితమైన వ్యక్తి అని అన్నారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్ ఎదుట ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎదుట తన వాదన లు వినిపించారని గుర్తుచేశారు. ఏ రోజు కూడా పార్టీలకు అనుబంధంగా చూడలేదు. శాసనసభ ప్రాంగణంలో కూడా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఆలోచనలు కింది స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తలు చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ జయశం కర్ 90వ జయంతిని అధికారికంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అన్నారు. జయశంకర్ సార్ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆర్డీవో వెంకటేష్, జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.